twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే నా పీరియడ్స్ ఆగిపోయాయి.. షాకింగ్ కారణం చెప్పిన హాట్ బ్యూటీ!

    |

    'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సిరీస్ చూసే వారికి సోఫీ టర్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె గురించి మరింత వివరంగా చెప్పాలంటే... మన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తోటికోడలు. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంక పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిక్ సోదరుడు జో జోనస్‌తో సోఫీ టర్నర్ వివాహం కొన్ని రోజుల క్రితం జరిగింది.

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోఫీ టర్నర్ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదా, ఫేమ్ రావడంతో అది తన బాడీపై తీవ్రమైన ప్రభావం చూపిందని, దాని కారణంగా తనకు సంవత్సరం పాటు పీరియడ్స్ ఆగిపోయినట్లు తెలిపారు.

    13 ఏళ్ల వయసులోనే....

    13 ఏళ్ల వయసులోనే....

    నాకు 13 ఏళ్ల వయసు ఉన్నపుడే నటన రంగంలో వచ్చాను. ఈ క్రమంలో చిన్న వయసులోనే ఇండస్ట్రీ సర్కిల్‌లో ఫేమ్ రావడం మొదలైంది. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. మరో వైపు ఒత్తిడి కూడా పెరగడం మొదలైంది. ఇది తన ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిందని సోఫీ టర్నర్ తెలిపారు.

    పీరియడ్స్ ఆగిపోవడంతో థెరపీ తీసుకున్నా

    పీరియడ్స్ ఆగిపోవడంతో థెరపీ తీసుకున్నా

    ఆరోగ్యం మీద ప్రభావం పడటంతో సంవత్సరం పాటు పీరియడ్స్ రావడం ఆగిపోయింది. దీంతో థెరపీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్ కూడా శరీరం మీద తీవ్ర ప్రభావం చూపిందని సోఫీ తెలిపారు.

    అతడు నా జీవితంలోకి వచ్చాక...

    అతడు నా జీవితంలోకి వచ్చాక...

    జో జోనస్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. అతడి సాన్నిహిత్యంలో ఎంతో రిలాక్స్ అవ్వడం మొదలైంది. నా హెల్త్ గురించి కూడా జోనస్ చాలా కేర్ తీసుకునే వాడు. జో జోనస్ లేకుంటే నా పరస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేను. అతడు లేకుంటే జీవించలేను అనిపించింది. అందుకే ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నమని సోఫీ టర్నర్ తెలిపారు.

    సోఫీ టర్నర్, జో జోనస్ వివాహం

    సోఫీ టర్నర్, జో జోనస్ వివాహం

    23 ఏళ్ల సోఫీ టర్నర్ వివాహం 29 ఏళ్ల జో జోనస్‌తో మే 1న జరిగింది. ఇద్దరూ ‘గేమ్ ఆఫ్ థోన్స్'లో కలిసి నటించారు. ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ‘గేమ్ ఆఫ్ థోన్స్' 8వ సీజన్ ఇటీవల విడుదలైన తర్వాత పెళ్లి చేసుకున్నారు.

    English summary
    In the Sunday Times interview, Sophie Turner affirmed that when she did not get her periods for a year, she decided that she has to take therapy. She further revealed that the social media trolls also had a negative impact on her body.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X