ప్రముఖ ర్యాపర్ కాల్చివేత.. రెస్టారెంట్‌లో బుల్లెట్ల వర్షం కురిపించిన అగంతకులు

దక్షిణాఫ్రికాకు చెందిన ర్యాపర్ AKA అలియాస్ కీర్నన్ ఫోర్బ్స్ దారుణ హత్యకు గురయ్యారు. డర్బన్‌లో జరిగిన కాల్పుల్లో ర్యాపర్‌తోపాటు తన బాడీగార్డ్ చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యానని మీడియా కథనాలు వెలువడ్డాయి. ర్యాపర్ కీర్నన్ ఫోర్బ్స్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఆయన మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కీర్నన్ ఫోర్బ్స్ మరణాన్ని ఆయన ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కీర్నన్ ఫోర్బ్స్ మరణ వార్త నిజమే. మా కుమారుడి మరణం వెనుక అసలు కారణాలు పోలీసుల నుంచి సేకరిస్తున్నాం అని తల్లిదండ్రులు టోని, లిన్ ఫోర్బ్స్ తెలియజేశారు.

South African Rapper AKA alias Kiernan Forbes shot dead at Durban

మా కుమారుడు కీర్నన్ ఫోర్బ్స్ ఇకలేరని తెలియజేయడానికి దు:ఖిస్తున్నాం. ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. కీర్నన్ ఫోర్బ్స్ మాకు కొడుకు, బ్రదర్, మనవడు, కజిన్, ఫ్రెండ్, అంతేకాకుండా కూతురు కైరోకు అత్యంత ప్రేమను పొందే తండ్రి అని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే కీర్నన్ ఫోర్బ్స్ మరణవార్త గురించి మీడియా కథనం వెల్లడిస్తూ.. డర్బన్‌లోని పాపులర్ రెస్టారెంట్‌లో ఆయన కాల్చివేతకు గురయ్యాడు. ఆయనపై అంగతకులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ కాల్పుల్లో ఆయనతోపాటు అంగరక్షకుడు మరణించాడు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి స్థానిక హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.

Kiernan Forbes విషయానికి వస్తే.. అల్టర్ ఇగో, లెవెల్స్, టచ్ మై బ్లడ్ లాంటి ఆల్బమ్స్ రూపొందించారు. ఎంటీవీ, సౌతాఫ్రికన్ మ్యూజిక్ అవార్డులను అందుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X