»   » 8 మంది యువతుల ధాటికి నటుడు ఆత్మహత్య.. అలాంటి వాడంటూ!

8 మంది యువతుల ధాటికి నటుడు ఆత్మహత్య.. అలాంటి వాడంటూ!

Subscribe to Filmibeat Telugu

ప్రపంచ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం జోరందుకుంది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సెలబ్రిటీలు, మహిళాలంతా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మీ టూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక ఘటనలని ఎండగట్టేందుకు ఈ ఉద్యమం సాగుతోంది. మీ టూ ధాటికి ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సౌత్ కొరియా లో చోటు చేసుకుంది.

జో మిన్ కి అనే ప్రముఖ హాలీవుడ్ నటుడు దక్షణ కొరియాలో గురువారం ఆత్మహత్య చేసుకుని తన గదిలో విగత జీవిగా కనిపించాడు. ఇటీవల అతడిపై 8 మంది యువతులు లైంగిక ఆరోపణలు చేశారు. అతడికి మీడియాలో మీ టూ క్యాంపైన్ కూడా నిర్వహించారు.

South Korean actor Jo Min ki found dead

దీనితో అతడిపై మీడియా, ప్రభుత్వం ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి భరించలేక అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 8 మంది యువతులు అతడిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఆ అమ్మాయిలు ఎలాంటి వారో నిరూపిస్తానని ఛాలెంజ్ విసిరాడు.

కానీ ప్రముఖులు, మీడియా అతడిని టార్గెట్ చేయడంతో గురువారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతడిది నిజంగానే ఆత్మహత్యేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సౌత్ కొరియా ప్రభుత్వం మాత్రం ఆత్మహత్యే అని నిర్ధారించింది. జో మిన్ కి 200 పైగా హాలీవుడ్ చిత్రాలతో నటించాడు.

English summary
South Korean actor Jo Min Ki, accused of sexual assault, found dead
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu