బాత్రూంలో ఉరి వేసుకున్న హీరోయిన్.. షాకైన ఫ్యాన్స్, ఏం జరిగిందో?
ప్రముఖ సౌత్ కొరియన్ నటి జియోన్ మి-సియోన్ శవమై కనిపించారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఆమె శనివారం జియోన్ఝు సిటీలోని ఓ హోటల్ బాత్రూంలో ఉరి వేసుకుని కనిపించారు. జియోన్ మి-సియోన్ వయసు 48 సంవత్సరాలు.
రెండు రోజులుగా ఆమె కనిపించక పోవడంతో మేనేజర్ ఈ విషయం మీడియాకు తెలపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ఇన్వెస్టిగేషన్ తర్వాతే...
జియోన్ మి-సియోన్ మరణ వార్తను సౌత్ కొరియా పోలీసులు ధృవీకరించారు. అయితే ఇంకా విచారణ పూర్తి కాలేదని, ఆమె మరణానికి కారణం ఏమిటి? ఇది ఆత్మహత్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశాలపై ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతే క్లారిటీ ఇస్తామని తెలిపారు.

సూసైడ్ నోట్ లభించలేదు
రెండు రోజుల క్రితమే జియోన్ మి-సియోన్ హోటల్‌లో దిగారని, ఆమెను ఎవరూ బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డ హోటల్ రూములో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు.

ఆ సంఘటనతో మరింత పెరిగిన డిప్రెషన్
కొంతకాలంగా జియోన్ మి-సియోన్ డిప్రెషన్‌తో బాధ పడుతున్నారు. దానికి తోడు ఇటీవల కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయారు. ఆమె తల్లి కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇవన్నీ ఆమెలో డిప్రెషన్ మరింత పెరగడానికి కారణం అయుండొచ్చు, ఇదే ఆత్మహత్యకు దారి తీస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

జియోన్ మి-సియోన్
2005లో వచ్చిన ‘లవ్ ఈజ్ ఎ క్రేజీ థింగ్స్' అనే చిత్రంలో జియోన్ మి-సియోన్ హీరోయిన్‌గా నటించారు. మదర్, మెమొరీస్ ఆఫ్ మర్డర్, హైడ్ అండ్ సీక్, బంగీ జంపింగ్ ఆఫ్ దెయిర్ ఓన్ లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆమె నటిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











