రెండు సంవత్సరాలకే రెండో పెళ్లికి సిద్దమైందంటూ రూమర్...
మైఖెల్ జాక్సన్ తర్వాత ప్రపంచం వ్యాప్తంగా ఎక్కువ మంది పాప్ అభిమానులను సంపాదించుకున్నారు బ్రిట్ని స్పియర్స్. చిన్నతనం నుండే స్టేజి మీద ఫెర్పామెన్స్‌లు, నాటికలు మొదలుగునవి వేసిన అనుభవం ఆమె సొంతం. బేబి వన్ మోర టైమ్ అనే ఆల్బమ్ ద్వారా 1999లో మ్యూజిక్ ప్రపంచంలో రంగ ప్రవేశం చేసారు. కేవలం రెండు ఆల్బమ్స్(బేబి వన్ మోర టైమ్, ఊప్స్ ఐ డిడ్ ఇట్ ఎగైన్) తోనే అనతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ సింగర్ గా ఎదగడం జరిగింది. 1990లలో బ్రిట్నీ స్పియర్స్ టీనేజి పాప్ ప్రపంచానికి ఓ ఐకాన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు.
ఆ తర్వాత కాలంలో బ్రట్నీ స్పియర్స్ కెవిన్ ఫెడరలైన్ ప్రేమించి పెళ్లి చేసుకొవడం జరిగింది. కెవిన్ ఫెడరలైన్ ద్వారా బ్రిట్ని స్పియర్స్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 29 సంవత్సరాల వయసు కలిగిన బ్రట్నీ స్పియర్స్‌కి ఇద్దరు పిల్లలు సీన్ ప్రెట్సన్(5), జేడన్(4) సంవత్సరాలు వయసు కలిగి ఉన్నారు. తన భర్త నుండి కొన్ని అనివార్య కారణాలు వల్ల విడిపోయిన బ్రిట్నీ స్పియర్స్ ఆ తర్వాత తన బాయ్ ప్రెండ్ జాసన్ ట్రావిక్‌తో కలసి జీవనం సాగిస్తుంది.
ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా..? బ్రిట్నీ స్పియర్స్ బాయ్ ప్రెండ్ జాసన్ ట్రావిక్ లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ జ్యూయల్స్ షాపైన 'పాస్కల్ మావుడ్' కి వెళ్లడం జరిగింది. అక్కడకి జాసన్ ట్రావిక్ వెళ్లడానికి కారణం ఉందండోయ్. ఇటీవల హాలీవుడ్లో వచ్చిన రూమర్ ప్రకారం వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంట. అందులో భాగంగానే జాసన్ ట్రావిక్ జ్యూయలరీ షాప్ కెళ్లి వెడ్డింగ్ రింగ్ అర్డర్ ఇవ్వడానికని సమాచారం. గత రెండు సంవత్సరాలుగా జాసన్ ట్రావిక్‌తో బ్రిట్నీ స్పియర్స్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై బ్రిట్నీ స్పియర్స్‌ని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. అంతేకాకుండా జాసన్ ట్రావిక్ అక్కడకి వెల్లడానికి కారణం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమాత్రం కాదని అన్నారు.


Click it and Unblock the Notifications











