వివాదాలే పరమావదిగా అయిన ఆమె ఈ ఈ దశాబ్దపు అతి పేద్ద... స్టార్..!!
1999వ సంవత్సరంలో 'హిట్ మీ బేబీ వన్ మోర్ టైమ్' అంటూ అమాంతం లేచిన పాప్ కెరటం బ్రిట్నీ స్పియర్స్. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఆమె చేసిన 'ఊప్స్ ఐ డిడ్ ఇట్ ఎగెయిన్' ఆల్బమ్ లో ఆమె పాప్ ప్రపంచంలో తిరుగులేని సింగర్ ఎదిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది బ్రిట్నీ. ఇంత వరకూ సజావుగానే గడచిపోయిన ఆమె జీవితం ఆ తర్వాత అనుకోని విధంగా వివాదాశ్పదమయింది. ఆమె వ్యక్తిగత జీవితం వివాదాశ్పదమయ్యి నలుగురి నోళ్లలో నానింది.
ఆమె చేసుకున్న రెండు వివాహాలు వివాదాశ్పదమయ్యి పెటాకులు అవడంతో పాటు ఆమె వ్యక్తిత్వం గురించి ఎన్నో వివాదాశ్పద వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో డిప్రెస్ అయిపోయిన బ్రిట్నీ పాటలకు, మీడియాకు దూరంగా వుంటూ వస్తోంది. కానీ ఈ వివాదాల నుండీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఆమెకు ఓ తీపి వార్త. ఈ దశాబ్దపు అతి పెద్ద సెలబ్రిటీగా ఆమె ఘనతను సాధించింది.
ఓ ప్రముఖ ఇంటర్నెట్ పోల్ నిర్వహించిన ఈ సర్వేలో 28 ఏళ్ల బ్రిట్నీ 35 % ఓట్లతో ప్రథమ స్థానంలో నిలువగా, ఈ దశాబ్దపు అందమయిన యువతిగా ఎంపికయిన ఏంజలీనా జోలీ 26 % ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అమెరికన్ సింగర్ బెవన్స్ నోవ్లెస్ మూడవ స్థానంలో నిలువగా, జస్టిన్ టింబర్ లేక్, టామ్ క్రూజ్, ప్యారిస్ హిల్టన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.


Click it and Unblock the Notifications











