సెకండ్ మ్యారేజికి సిద్దమైన పాప్ సింగర్...!!
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ గత కొంత కాలంగా జాసన్ ట్రావిక్‌తో సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మద్య ఉన్న సంబంధం ఇప్పడు భార్య భర్తల సంబంధంగా మారనుంది. లాస్ వేగాస్‌లో ఓ ప్రయివేట్ పార్టీలో వీరిద్దరూ కలసి వీరి ఎంగేజ్ మెంట్‌ని అత్యంత బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ప్లానెట్ హాలీవుడ్ రిసార్ట్‌లో అత్యంత వైభవంగా శుక్రవారం జరిగింది. ఐతే ఈ ప్రయివేట్ కార్యక్రమానికి బ్రిట్నీ, ట్రావిక్ దగ్గర బంధువులను ఆహ్వానించడం జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత పారిస్ హోటల్‌లో అతిధులకు అద్బుతమైన డిన్నర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అందరి కోసం చాతే నైట్ క్లబ్‌లో డాన్స్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది.
జాసన్ ట్రావిక్, బ్రిట్నీతో ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని తన స్నేహితుడు టివీ యాంకర్ బిల్లీ బుష్ ద్వారా అధికారకంగా ప్రకటింపజేశాడు. బ్రిట్నీ స్పియర్స్ కూడా తన ఎంగేజ్ మెంట్‌ని మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. జాసన్ ట్రావిక్ 40వ పుట్టినరోజుని జరుపుకుంటున్న సందర్బంగా బ్రిట్నీని తాను ప్రేమిస్తున్న విషయం తెలిపాడు. ఇక బ్రిట్నీ స్పియర్స్ విషయానికి వస్తే గతంలోనే పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జాసన్ ట్రావిక్‌తో బ్రిట్నీది సెకండ్ మ్యారేజి.


Click it and Unblock the Notifications











