లండన్‌లో 2008 తర్వాత మళ్లీ కలిసిన స్పైస్ గర్ల్స్
లండన్, జూన్ 27: 'ఫేమస్ గర్ల్ బ్యాండ్' స్పైస్ గర్ల్స్ కు చెందిన కొంత మంది నటీమణులు లండన్‌లో మ్యూజిక్‌లో భారీ హిట్స్ సాధించిన వాటిని ప్రారంభించేందుకు అందరూ కలిశారు. గతంలో స్పైస్ గర్ల్స్‌గా వ్యవహారించిన విక్టోరియా బెకహామ్, మెలనీ చిశోల్మ్, ఎమ్మా బున్టన్, గేరీ హాలీవెల్, మెలనీ బ్రౌన్ 2008 సంవత్సరం తర్వాత మొట్టమొదటి సారి అందరూ మంగళవారం కలుసుకున్నారు.
వీరంతా సెయింట్ పాన్‌క్రాస్ రినయ్సెస్ హోటల్‌లో కొత్త స్టేజి షోని ప్రమోట్ చేసే భాగంలో కలుసుకున్నారు. 1998వ సంవత్సరంలో విడుదలైన సింగల్ ట్రాక్ మ్యూజిక్ వీడియో 'వన్నాబే' మాదిరి ఫోటోలకు మెట్లపై నుండి అభిమానులకు అభివాదం చేస్తూ ఫోజులిచ్చారు. ఇలా స్టేజి షో నిమిత్తం మేమంతా తిరిగి కలుసుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని అందరూ ట్విట్టర్‌లో అనుభూతిని పంచుకున్నారు.
విక్టోరియా బెకహామ్ తన ట్విట్టర్‌లో గుడ్ మార్నింగ్ లండన్!! ఈరోజు సాంగ్ రియునైటెడ్ లండన్‌లో ఒక మంచి రోజు, ఇంట్లో ఉండడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. మెలనీ బ్రౌన్ ఐతే ఏకంగా తన్ ట్విట్టర్‌లో వూప్ వూప్ అంటూ స్పైస్ అభిమానులకు అభివాదం చేస్తూ ట్వీట్ చేశారు. 1994లో 'ఫేమస్ గర్ల్ బ్యాండ్' ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాండ్ 18 పాటలతో కూడిన మ్యూజిక్ ఆల్బమ్‌ను డిసెంబర్‌లో వెస్ట్ ఎండ్ పిక్కడిల్లీ థియేటర్ లో అంగరంగ వైభవంగా విడుదల చేయనున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











