Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
స్పైడర్ మ్యాన్‌కు తప్పని మాస్క్.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ.. ఫోటో వైరల్
స్పైడర్ మ్యాన్ అంటే చిన్న పిల్లలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంత ఇష్టమో చెప్పడం కష్టం. అలాంటి స్పైడర్ మ్యాన్‌కు కరోనావైరస్ తిప్పలు తప్పలేవు. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా సినిమాల విడుదల ఆగిపోయింది. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సీక్వెల్ చిత్రాలకు లాక్డౌన్ అడ్డుకట్టవేసింది. వినోదం కరువైన ప్రేక్షకులను మళ్లీ నవ్వించేందుకు, కొత్త అనుభూతిని పంచేందుకు స్పైడర్ మ్యాన్ పోస్టర్‌ను ఎంసీయూ రిలీజ్ చేసి నవ్వుల్లో ముంచెత్తింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ గురించిన వివరాల్లోకి వెళ్లితే..
లాక్డౌన్ దెబ్బతో బ్లాక్ విడో, ఎటెర్నల్ రిలీజ్ వాయిదా
గత కొన్నేళ్లుగా ఎన్నో జనరంజక సినిమాలను అందించిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)కు 2020 చేదు అనుభవాన్ని మిగిల్చింది. కరోనావైరస్ కారణంగా విడుదల కావాల్సిన బ్లాక్ విడో, ఎటెర్నల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. వాస్తవానికి ఎప్పడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాలు ప్రస్తుత పరిస్థితుల కారణంగా 2021కు వాయిదా వేశారు. దాంతో ప్రేక్షకులకు ఓ రకమైన నిరాశలో మునిగిపోయారు.
లాక్డౌన్ తర్వాత స్పైడర్ మ్యాన్ 3 షూట్ ప్రారంభం
తమ సంస్థ రూపొందించే చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఎంసీయూ శుభవార్తను అందించింది. తాము రూపొందిస్తు్న స్పైడర్ మ్యాన్ 3 చిత్ర షూటింగ్‌ను జార్జియా, అట్లాంటాలో ప్రారంభించామని సినీ ప్రముఖుడు టామ్ హాలెండ్ వెల్లడించారు. తమ సినిమా ప్రారంభమైందని చెప్పడానికి సెట్స్‌లో స్పైడర్ మ్యాన్ పాత్రను పోషించే వ్యక్తి ముఖానికి మాస్క్ వేసిన ఫోటోను షేర్ చేశారు.
స్పైడర్ మ్యాన్ ముఖానికి మాస్కా?
స్పైడర్ మ్యాన్‌కు మాస్క్ తొడిగిన ఫొటోను చూసి అభిమానుల్లో నవ్వుల్లో మునిగిపోతున్నారు. అభిమానులుందరూ ఏంటీ స్పైడర్ మ్యాన్ ముఖానికే మాస్కా? అంంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. స్పైడర్ మ్యాన్ పాత్రధారి టామ్ హాలెండ్ తన ఫోటోను పోస్టు చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఊహించని విధంగా క్రేజ్ వచ్చింది. మాస్క్ ధరించిండి. నేను రెండు మాస్కులు ధరిస్తున్నాను అంటూ కామెంట్ పెట్టారు. తన అకౌంట్‌కు కొన్ని గంటల్లోనే 39 మిలియన్ల మేరకు ఫాలోవర్స్ పెరిగారు.
మ్కాస్తో స్పైడర్ మ్యాన్ చూసి నవ్వుతూ..
టామ్ హలెండ్ చేసిన పోస్టుకు సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతున్నది. పలువురు ప్రముఖులు రకరకాల ఇమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. పలువురు హాలీవుడ్ నటులు ముఖానికి మాస్క్ ఉన్న స్పైడర్ మ్యాన్‌ను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నాం అని మెసేజ్ చేస్తున్నారు. ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ రావడం బట్టి స్పైడర్ మ్యాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో స్పష్టమవుతున్నది.
స్పైడర్ రిలీజ్ డేట్ ఇదే
కరోనావైరస్ పరిస్థితులు సానుకూలంగా ఉంటే వచ్చే ఏడాది స్పైడర్ మ్యాన్ 3ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత, దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్తోపాటు బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జామీ ఫాక్స్, జెండ్యా, జాకోబ్ బాటాలోన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 సంవత్సరంలో డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని డేట్‌ను ఫిక్స్ చేశారు.