Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఫస్ట్ అఫీషయిల్ ట్రైలర్.... ‘స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్’
లాస్ ఏంజిల్స్: స్పైడర్ మ్యాన్ సిరీస్ చిత్రాల అభిమానులకు శుభవార్త. త్వరలో మరో సిరీస్ రాబోతోంది. ‘స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్’ పేరుతో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు.
లాస్ ఏంజిల్స్: స్పైడర్ మ్యాన్ సిరీస్ చిత్రాల అభిమానులకు శుభవార్త. త్వరలో మరో సిరీస్ రాబోతోంది. 'స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్' పేరుతో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు.
జాన్ వాట్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత సిరీస్ చిత్రాల కంటే అద్భుతమైన విన్యాసాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందులో స్పైడర్ మేన్ పాత్రలో 20 ఏళ్ల వయసున్న టామ్ హాలండ్.... పీటర్ పార్కర్/స్పైడర్ మేన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంతకు ముందు టామ్ హాలండ్ ది హార్ట్ ఆఫ్ ది సీ, కెప్టెన్ అమెరికా-సివిల్ వార్ చిత్రాల్లో నటించాడు.
వీరితో పాటు 'ఐరన్‌మ్యాన్' ఫేం, హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది.
హాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన మార్వెల్ స్టూడియోస్, కొలంబియా పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సంస్థ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.