Spider Man హిట్ తర్వాత కళ్లు చెదిరే ఇల్లు కొనుగోలు చేసిన టామ్ హాలెండ్.. లవర్‌తో కలిసి ఏంజెలీనా నివాసం పక్కనే..

స్పైడర్ మ్యాన్: నో వే హోం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేసింది. హాలీవుడ్‌ బాక్సాఫీస్ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రంలో నటించిన స్టార్ సెలబ్రిటీలు, స్పైడర్ ఫేమ్ టామ్ హాలెండ్, ఆయన గర్ల్ ఫ్రెండ్ జెండాయా మరోసారి వార్తల్లో నిలిచారు. స్పైడర్ మ్యాన్ సినిమాలో నటించిన తర్వాత వీరిద్దరూ భారీ రెమ్యునరేషన్ అందుకొన్నారు. తాజాగా లండన్‌లో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేయడం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

2016లో జెండాయాతో టామ్ హాలెండ్ అఫైర్

2016లో జెండాయాతో టామ్ హాలెండ్ అఫైర్

స్పైడర్ మ్యాన్ చిత్రంలో హీరో టామ్ హాలెండ్, నటి జెండాయా ఇద్దరు ప్రస్తుతం అఫైర్‌లో ఉన్నారు. స్పైడర్ మ్యాన్: హోం కమింగ్ సినిమా షూటింగ్ సమయంలో అంటే 2016లో వారిద్దరు కలుసుకొన్నారు. ఆ షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య అఫైర్ మొదలైంది. అయితే రెండేళ్ల క్రితం వారిద్దరి విడిపోయారనే వార్తలు వచ్చాయి. కానీ ఓ ఫంక్షన్‌లో వారిద్దరూ ముద్దులు పెట్టుకొంటూ కనిపించడంతో ఆ వార్తలన్నీ రూమర్లే అనే విషయం స్పష్టమైంది.

లండన్‌లో విలాసవంతమైన ఇల్లు

లండన్‌లో విలాసవంతమైన ఇల్లు

అయితే టామ్ హాలెండ్‌తో ప్రేమలో పడిన తర్వాత జెండాయా 3 మిలియన్ పౌండ్ల వ్యయంతో లాస్ ఎంజెలెస్‌లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ లాస్ ఎంజెలెస్‌లోని ఇంటిలోనే ఉంటూ వస్తున్నారు. అయితే అఫైర్ కొనసాగిస్తున్న ఇద్దరు కలిసి ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాకుండా తాను చిన్నతనంలో నివసించిన లండన్‌లోని రిచ్‌మండ్‌లో టామ్ హాలెంట్ ఇంటిని కొనుగోలు చేయడం వార్తగా మారింది. ప్రస్తుతం ఆ ఇంటిని 250000 పౌండ్ల వ్యయం కొన్నారు. ప్రస్తుత నవీకరణ చేస్తూ.. జిమ్, సినిమా థియేటర్ తదితర గదులను నిర్మించే పనిలో ఉన్నారు అని హాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

 హై సెక్యూరిటీ ఇంటి నిర్మాణం

హై సెక్యూరిటీ ఇంటి నిర్మాణం

టామ్ హాలెండ్, జెండయా ఇద్దరు కలిసి 250,000 పౌండ్ల ధరకు ఇంటిని కొనుగోలు చేశారు. వారిద్దరు ఇప్పుడు చాలా సంతోషంలో మునిగి తేలుతున్నారు. జంటగా కలిసి కొనడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. ఇంటి చుట్టు హై సెక్యూరిటీ ఉండేలా చూసుకొంటున్నారు. 8 ఫీట్ల ఎత్తుతో సెక్యూరిటీ గేట్‌ను నిర్మిస్తున్నారు. ఈ నవీకరణ పనులు పూర్తి కాగానే గృహ ప్రవేశం చేయాలని వేచి చూస్తున్నారు అని మిర్రర్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

 ఎంజెలీనా జోలి నివాసం పక్కనే..

ఎంజెలీనా జోలి నివాసం పక్కనే..


టామ్ హాలెండ్, జెండయా కొనుగోలు చేసిన రిచ్‌మెంట్ ప్రాంతంలో హాలీవుడ్‌కు చెందిన టాప్ సెలబ్రిటీలు ఉంటారు. ఈ ప్రాంతంలో నివసించే వారిలో సర్ మిక్ జాగర్, ఎంజెలీనా జోలీ, సర్ డేవిడ్ అటెన్‌బరో, టామ్ హార్డీ లాంటి ప్రముఖుల ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు టామ్ హాలెంట్ జంట ఆ ప్రాంతంలో ఇల్లును కొనుగోలు చేసి వారికి ఇరుగుపొరుగు వారిగా మారిపోయారు.

Recommended Video

Mission: Impossible – Fallout Movie Review మిషన్ ఇంపాజబుల్ సినిమా రివ్యూ
 స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రికార్డుల పరంపర

స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రికార్డుల పరంపర

ఇదిలా ఉండగా, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌‌లో 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించింది. అలాగే అమెరికాలో ఈ చిత్రం 735,886,280 డాలర్లు వసూలు చేసింది. ఇదే జోష్ కొనసాగితే ఈ చిత్రం ఓవర్సీస్‌లో 2 బిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం తొందర్లోనే ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X