స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ సృష్టికర్త స్టాన్ లీ ఇక లేరు..
హాలీవుడ్ సినీ ప్రముఖడు, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ది హల్క్ సృష్టికర్త స్టాన్ లీ ఇకలేరు. గత కొద్దికాలంగా వృద్ధాప్య సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. స్టాన్ మరణ వార్తను ఆయన కుమార్తె ధృవీకరించింది. ఆయన వయసు 95 సంవత్సరాలు.
సినీ రచయిత, ఎడిటర్, దర్శకుడిగా ఆయన సుపరిచితులు. అప్పట్లో యువ రీడర్ల కోసం సూపర్ హీరోల కథలను కామిక్స్‌గా మలిచిన తొలితరం రచయిత ఆయన. దశాబ్దాలుగా ఎంతో మంది పుస్తక ప్రేమికుల హృదయాలను ఆయన కొల్లగొట్టారు.

నా తండ్రి సంపూర్ణంగా జీవితాన్ని అనుభవించాడు. తాను నమ్మిన పని కోసం తన జీవితాన్ని ధారపోశాడు. ఆయన అందించిన సేవలను కుటుంబం, అభిమానులు అమితంగా ప్రేమించారని చెప్పడానికి గర్వపడుతున్నాను అని స్టాన్ లీ కుమార్తె సంతాప ప్రకటనను విడుదల చేశారు.
సోమవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యాడు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మరణించారని వైద్యులు ధృవీకరించారు అని హాలీవుడ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.


Click it and Unblock the Notifications











