twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలో మెగా ఫోన్ పట్టనున్న మెగా దర్శకుడు..

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ 'స్టీవెన్ స్పీల్‌బర్గ్' ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్ద అయిన వార్నర్ బ్రదర్స్‌తో ఇటీవల కాలంలో చర్చలు జరిపినట్లు సమాచారం. స్పీల్ బర్గ్, వార్నర్ బ్రదర్స్‌తో చర్చలు జరపడానికి కారణం త్వరలో 'గాడ్స్ అండ్ కింగ్స్' అనే సినిమాని తీయనున్నట్లు సమాచారం. వార్నర్ బ్రదర్స్ సంస్దతో స్పీల్ బర్గ్ బంధం ఈనాటిది కాదనే విషయం అందరికి తెలిసిందే. గతంలో వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సారధ్యంలో స్పీల్ బర్గ్ చాలా సినిమాలు తీయడం జరిగింది.

    64సంవత్సరాలు వయసు కలిగిన స్టీవెన్ స్పీల్ బర్గ్ తన జీవితంలో హాలీవుడ్‌కి ఎన్నో అత్యంత అధ్బుతమైన సినిమాలను అందించడం జరిగింది. స్టీవెన్ స్పీల్ బర్గ్ త్వరలో తీయనున్న ఈ సినిమాకి కధను మైఖెల్ గ్రీన్, స్టువార్ట్‌లు అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కధ ఈజిప్టు కాలంలో జరిగిన రాజులు, దేవుళ్లుకు సంబంధించినదిగా ఉంటుందని సమాచారం.

    స్టీవెన్ స్పీల్‌బర్గ్ హాలీవుడ్‌లో ఒకానొక టైమ్‌లో నెంబర్ వన్ డైరెక్టర్‌గా వెలుగొందారు. ఇంకా చెప్పాలంటే 1975(జాస్), 1982(ది ఎక్స్‌స్ట్రా టెరిస్ట్రియల్), జురాసిక్ పార్క్(1993)లో విడుదలైన సినిమాలు ఆల్ టైమ్ బాక్సీఫీసు రికార్డుల్ని నమోదు చేయడమే కాకుండా, హాలీవుడ్‌లో ఎక్కువ కలెక్షన్లు సంపాదించిన సినిమాలుగా చరిత్రకెక్కాయి. ఇప్పటి వరకు కూడా స్పీల్ బర్గ్ సినిమా తీసిన సినిమాలన్నీ కూడా $8.5 కలెక్షన్లకు ఎక్కువ సాధించిన సినిమాలే.

    English summary
    Director Steven Spielberg is in discussions with Warner Bros. to direct new religious movie “Gods and Kings”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X