twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టీవెన్ స్పీల్‌బర్గ్‌కు అత్యున్నత పురస్కారం

    By Bojja Kumar
    |

    వాషింగ్టన్: ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్ అత్యున్నత పురస్కారం అందుకోబోతున్నారు. అమెరికా పౌరువలకు ఇచ్చే అత్యున్నత గౌరవపురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్'కు ఆయన్ను ఎంపిక చేసినట్లు వైట్ హౌస్ వర్గాలు ప్రకటించారు. ఈయనతో పాటు ఎంటర్టెనర్ బార్‌బ్రా స్ట్రెయిసండ్, బేస్ బాల్ లెజెండ్ విల్లీ మేస్ సహా 17 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. నవంబర్ 24న వైట్ హౌస్ ఈ పురస్కారాలను అందజేయనున్నారు.

    స్టీవెన్ స్పీల్ బర్గ్ సినిమాల విషయానికొస్తే...
    2013 లో వాయిదా వేసిన ఓ చిత్రాన్ని మళ్లీ స్పీల్ బర్గ్ ఇప్పుడు మొదలెట్టారు. డానియల్ హెచ్. విల్సన్ ..బెస్ట్ సెల్లింగ్ నవల 'రోబోపొకలిప్స్‌' ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే టైటిల్ సినిమాకు పెట్టనున్నారు. ఇక స్పీల్ బర్గ్ సినిమాను తెరకెక్కించే విధానం పకడ్బందీగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే చిత్రంలోని ప్రధాన పాత్రలు, వాటి ఆహార్యం, కాస్ట్యూమ్స్‌తో పాటు తెరపై కనిపించే ప్రతి వస్తువూ ఎలా ఉండాలన్న దానిపై దృష్టిపెడతారు. ఇందుకు ఎన్నో స్కెచ్‌లు గీస్తారు.

    Spielberg, Streisand, Willie Mays among presidential medal recipients

    దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ప్రస్తుతం'రోబోపొకలిప్స్‌'ను తెరకెక్కించటానికి అదే పనిలో ఉన్నారు. సైంటిఫిక్‌ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వివిధ రకాల రోబోలు, విచిత్రమైన ఆయుధాలు ఉండబోతున్నాయట. ఈ చిత్రం కధాంశం మొత్తం భవిష్యత్ లో జరుగుతుంది. అంటే రాబోయే తరంలో అన్నమాట.

    English summary
    Director Steven Spielberg, entertainer Barbra Streisand, baseball legend Willie Mays and composer Stephen Sondheim are among 17 Presidential Medal of Freedom recipients, the White House announced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X