బలవంతంగా లిప్‌లాక్.. ఊపిరి ఆగిపోయేలా కౌగిలి.. స్టార్ హీరోకు 8 నెలల జైలుశిక్ష!
స్వ్కిడ్ గేమ్ చిత్రంలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు ఓ యేంగ్ సూ (O Yeong-Su)కు కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొన్నారనే విషయంలో 79 ఏళ్ల యాక్టర్‌కు కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ ఘటన కొరియాలో సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తనను బలవంతంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తనను లైంగిక వేధించారని నటుడు ఓ యేంగ్ సూపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. 2017లో జరిగిన ఘటనపై కొరియాలోని సుమాన్ జిల్లా కోర్టుకు సీంగ్నామ్ బ్రాంచ్ కోర్టు విచారణ చేపట్టింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

అయితే యువతి ఫిర్యాదు చేసిన కేసులో బలమైన సాక్ష్యాలు ఉండటంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో నటుడు యేంగ్ సూను దోషిగా పరిగణిస్తూ కఠిన శిక్ష విధించింది. యువతి ఆరోపణలు రుజువు కావడంతో నటుడికి ఎనిమిది నెలల జైలు శిక్షను, రెండేళ్లపాటు యాక్టింగ్‌పై నిషేధం విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
కోర్టు జైలుశిక్షను విధించిన తర్వాత కూడా తనపై వచ్చిన ఆరోపణలను స్విడ్ గేమ్ యాక్టర్ ఖండించారు. తనకు విధించిన శిక్షను ఎగువ కోర్టులో సవాల్ చేస్తానని మీడియాకు తెలిపాడు. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించిన 40 గంటల కౌన్సిలింగ్ క్లాసులకు హాజరవుతానని అన్నారు.

అయితే ఓ సరస్సు వద్ద యువతి పరిచయమైంది. ఆమెను చేతి పట్టుకొని దానిని దాటించడానికి ప్రయత్నం చేశాను. అయితే ఆ విషయాన్ని అడ్డుపెట్టుకొని తనపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఒకవేళ తాను తప్పు చేసినట్టు భావిస్తే.. క్షమాపణలు కోరాను. కానీ ఆ యువతి నాపై ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టింది అని ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











