»   » కౌబాయ్ & ఇండియన్స్: హాలీవుడ్ మూవీలో శ్రీదేవి

కౌబాయ్ & ఇండియన్స్: హాలీవుడ్ మూవీలో శ్రీదేవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం ద్వారా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇప్పటికీ తన నటనలో, అందంలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడమే కాదు....సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సినిమా రంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేసేందుకు తనదైన రీతిలో ముందుకు సాగుతోంది.

తాజాగా శ్రీదేవి గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలో ఆమె ప్రముఖ హాలీవుడ్ నటి మార్లీ స్ట్రీప్స్‌తో కలిసి హాలీవుడ్ చిత్రంలో నటించబోతోంది. 'కౌబాయ్స్ అండ్ ఇండియన్స్' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాలీవుడ్ బడా నిర్మాతలు జెరెమీ వా్, జెర్రీ లైడర్ ఈ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్‌ను మరోసారి ప్రపంచ తెరపై చూపించబోతున్నారు.

మార్లీ స్ట్రీప్స్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి. ఎనిమిది సార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకుంది. శ్రీదేవి భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఐదు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఘనత ఆమెది. ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటం సినీవర్గాల్లో చర్చనీయాంశం అయింది.

'కౌబాయ్ అండ్ ఇండియన్స్' చిత్రానికి హాలీవుడ్ దర్శకురాలు అమీ రెడ్‌ఫోర్డ్ దర్శకత్వం వహించనున్నారు. అమీ ఎవరో కాదు....హాలీవుడ్ లెజెండ్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ కుమార్తె. మార్లీ, శ్రీదేవి కీలకమైన పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

English summary
Bollywood actress Sridevi Kapoor who has stolen many hearts with her comeback in the movie English Vinglish is going places and this time it's beyond Bollywood. Word is out that Sridevi will be working with Meryl Streep in a Hollywood movie titled Cowboys and Indians.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu