నోయిడాలో జరిగే 'గాగా షో'కి బాలీవుడ్ బాద్ షా..!!
పాప్ మ్యూజిక్ ప్రపంచంలో మైఖెల్ జాక్సన్ తరువాత పరిచయం అక్కర లేని పేరు లేడిగాగా. ఇండియాలో మొట్టమొదటి సారి ఫార్ములావన్ రేస్ జరుగుతున్న సందర్బంగా ఇండియాలో లేడిగాగా షోని ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్ములావన్ రేస్ ముగిసిన అనంతరం లేడిగాగా షో ఆదివారం రాత్రి గ్రేటర్ నోయిడాలో జరగునుంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరుకానున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్' గా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమచారం. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. షారుఖ్ తన ట్విట్టర్ ఎకౌంట్లో ఏమని పోస్ట్ చేశారంటే 'రావన్ సినిమా'ని లాస్ ఏంజిల్స్ లో ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి అంతా ఢిల్లీలో జరుగుతున్న ఫార్ములావన్ రేస్, లేడిగాగా షో మీద ఉందని ట్వీట్ చేశారు.
ఆదివారం రాత్రి జరగనున్న లేడిగాగా ఫెర్పామెన్స్ కోసం గాగా గురవారమే ఇండియాకు చేరుకున్న సంగతి తెలిసిందే. లేడిగాగా షోని గ్రేటర్ నోయిడాలో జేపీ గ్రీన్ గోల్ప్, స్పా రెస్టారెంట్‌లో 20,000 చదరపు మీటర్లులలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కొసం షారుఖ్ ఖాన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం సినిమా, ఫ్యాషన్, ఫార్ములా వన్ రేస్‌కి సంబంధించిన అతిధులకు మాత్రమేనని బాలీవుడ్ వర్గాల భోగట్టా.


Click it and Unblock the Notifications











