నటిపై అత్యాచారం.. అగ్ర నిర్మాతకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష.. అది కూడా సరిపోదంటూ!

సినీ రంగం రంగుల ప్రపంచం అయినప్పటికీ అక్కడ కూడా అనేక అవరోధాలు ఉంటాయి. ముఖ్యంగా నటీమణులకు, హీరోయిన్లుగా ఎదగాలనుకున్న అందమైన అమ్మాయిలకు క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు ఎదురు అవుతుంటాయి. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో సర్వ సాధారణం అయిపోయింది. వాటికి తలొగ్గకుండా రాణించేవాళ్లు కొంతమంది అయితే.. వాటికి భయపడి ప్రారంభించిన చోటే ఆగిపోయిన వాళ్లు ఎంతోమంది. సోషల్ మీడియా వాడకం పెరగడంతో మీటూ, క్యాస్టింగ్ కౌచ్ పై బహిరంగంగానే చెబుతున్నారు హీరోయిన్లు. ఇక్కడి ఇలా ఉంటే హాలీవుడ్ లో లైంగిక వేధింపులు ఎదుర్కున్న హీరోయిన్లు రుజువులతో సహా నిరూపించి సదరు ప్రముఖులను జైలులోకి పంపిస్తున్నారు.

ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ (70) లైంగిక వేధింపుల కేసులో కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. దశాబ్దాలపాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా వెలుగొందిన హార్వేకు మరో 16 ఏళ్లు జైలు శిక్ష పడింది. పదేళ్ల క్రితం యూరోపియన్ నటిపై బెవర్లీ హిల్స్ హోటల్ గదిలో అత్యాచారానికి పాల్పడిన కారణంగా లాస్ ఏంజెల్స్ కోర్టు 16 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ గురువారం (ఫిబ్రవరి 23) తీర్పు విడుదల చేసింది. ఇప్పటికే పలు లైంగిక, అత్యాచారాల కేసులో న్యూయార్క్ లో 23 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న హార్వే వేన్‌స్టీన్ కు మరో 16 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. దీంతో ఆయన జీవితాంతం జైల్లో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Star Producer Harvey Weinstein Sentenced To 16 Years On Rape Conviction

లైంగిక వేధింపుల కేసులో వీల్ చైర్ లో వచ్చిన ఆస్కార్ అవార్డ్ గ్రహిత హార్వే వేన్‌స్టీన్.. యావజ్జీవ కారాగార శిక్ష విధించవద్దని వేడుకున్నాడు. దానికి అతను అర్హుడు కాదని.. ఈ కేసులో చాలా లొసుగులు ఉన్నాయని కోర్టుకు విన్నవించుకున్నాడు. అయితే అతని వాదనలు పట్టించుకోని న్యాయమూర్తి లిసా లెంచ్.. హార్వేకు 16 ఏళ్ల జైలు జీవితంతోపాటు మరో మూడు శిక్షలు విధించారు. అయితే 2013లో నటి, మోడల్ పై హార్వె వేన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పడినట్లు గత డిసెంబర్ లోనే లాస్ ఏంజెల్స్ కోర్టు నిర్ధారించింది.

లాస్ ఏంజెల్స్ కోర్టులో హార్వేపై బాధితురాలు పలు ఆరోపణలు చేసింది. గరిష్ట కాలం శిక్ష విధించాలని కన్నీళ్లతో జడ్జ్ ముందు వేడుకుంది. అతని స్వార్థపూరితమైన, అసహ్యకరమైన చర్యల కారణంగా తన జీవితం నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అతను జీవితాంతం జైల్లో ఉన్నా సరిపోదని తెలిపింది. ఇదిలా ఉంటే హాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన హార్వే వేన్‌స్టీన్ పై సుమారు 80 మంది హాలీవుడ్ నటీమణులు, మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వారిలో స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ, సల్మా హాయక్, జెన్నిఫర్ ఐన్‌స్టన్ కూడా ఉన్నారు. 2017లో హార్వైపై వచ్చిన లైంగిక ఆరోపణలే మీటూ ఉద్యమానికి తెరదీశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X