ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘స్టార్ వార్స్’ ఫేం పీటర్ మేహ్యూ ఇక లేరు

ప్రముఖ హాలీవుడ్ నటుడు, 'స్టార్ వార్స్' సిరీస్ ఫేం పీటర్ మేహ్యూ ఇక లేరు. 74 ఏళ్ల మేహ్యూ గురువారం టెక్సాస్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఇతడి మరణ వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరిస్తూ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు.

ప్రఖ్యాత హాలీవుడ్ మూవీ సిరీస్ 'స్టార్ వార్స్'లో వూకీ వారియర్ చ్యూబాకో పాత్రలో పీటర్ మేహ్యూ ప్రేక్షకులను అలరించారు. ఆయన ఈ పాత్రలో తన హార్ట్ అండ్ సోల్ పెట్టి నటించారనే ప్రశంసలు అందుకున్నారు. మేహ్యూ మరణం అభిమానులను కలిచి వేసింది.

పీటర్ మేహ్యూ మే 19, 1944లో లండన్లో జన్మించాడు. 7.3 ఫీట్స్(2.21 మీటర్లు) పొడవుగల ఇతడు బ్రిటిష్ పోలిస్ మ్యాన్ కుమారుడు. సినిమాల్లోకి రాకముందు లండన్లో హాస్పిటల్ అటెండెంట్‌గా పని చేసేవాడు. నిర్మాత చార్లెస్ స్కనర్ ఇతడిని సినిమా రంగానికి పరిచయం చేశాడు.

Star Wars fame Peter Mayhew dies at 74

పీటర్ మేహ్యూ తన హైట్ కారణంగా ఓ సారి వార్తల్లోకెక్కాడు. పేపర్లో అతడి ఫోటో చూసిన 'సిన్‌బాద్ అండ్ ది ఐ ఆఫ్ ది టైగర్' నిర్మాతలు ఈ చిత్రంలో అతడిని మానేటర్ అనే పాత్ర కోసం తీసుకున్నారు. ఈ చిత్ర 1977లో విడుదలైంది. ఇదే ఏడాది 'స్టార్ వార్స్' మూవీలో అవకాశం దక్కించుకున్నాడు మేహ్యూ.

ఇప్పటి వరకు వచ్చిన 4 స్టార్ వార్స్ సిరీస్ చిత్రాల్లో పీటర్ మేహ్యూ నటించారు. తన కెరీర్లో మొత్తం 15 హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు పలు టెలివిజన్ షోలలో కూడా నటించారు. పీటర్ మేహ్యూ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X