హ్యాకర్స్ అటాక్: హీరోయిన్ల న్యూడ్ ఫోటోస్ లీక్
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ టాప్ హీరోయిన్లే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు భారీ హాకింగ్‌కు పాల్పడ్డారు. ఆస్కార్ విన్నర్ జెన్నిఫర్ లారెన్స్, పాప్ స్టార్ రిహానాతో పాటు హాలీవుడ్ న టాప్ హీరోయిన్ల వ్యక్తిగత ఫోటోలను ఆన్ లైన్ నుండి తస్కరించారు. ఇందులో వారికి సంబందించిన న్యూడ్ ఫోటోలు కూడా ఉండటం గమనార్హం.
సదరు స్టార్ హీరోయిన్లకు సంబందించిన న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో లీక్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ వ్యక్తిగత న్యూడ్ ఫోటోలు బయటకు లీక్ కావడంతో టాప్ హీరోయిన్లంతా ఆందోళనకు గురవుతున్నారు. జెన్ని ఫర్ లారెన్స్ ఈ దశ్చర్యపై మండి పడుతూ ట్వీట్ చేసారు. ఈ విషయంలో లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు ఆమెకు సంబంధించిన ప్రతినిధి మీడియాకు తెలిపారు.

హాకర్లు వ్యక్తిగత అకౌంట్లలోకి అక్రమంగా చొరపడటం, వారికి సంబంధించిన సమాచారం దొంగిలించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పోస్టు చేసిన వారిపై కఠిన చర్య తీసుకోనున్నట్లు జెన్నిఫర్ లారెన్స్ ప్రతినిధులు వెల్లడించారు.
ఆదివారం నుండి సోషల్ మీడియలో ఈ ఫోటోలు విరివిగా పోస్టు కావడంతో పాటూ ఇంటర్నెట్ మొత్తం విస్తృతంగా విస్తరించాయి. ఆ ఫోటోలను ఇంటర్నెట్ నుండి తొలగించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











