ఫ్యాన్స్ జాగ్రత్తగా వ్యవహారించండి: పోలీసులు
పాప్ గాయని విట్నీ హూస్టన్ అంత్యక్రియలు శనివారం న్యూజెర్సీలోని నేవార్క్ న్యూ పోప్ బాప్టిస్ట్ చర్చిలో జరగనున్న విషయం తెలిసిందే. విట్నీ హూస్టన్ అంత్యక్రియలకు హాజరవుదామనుకున్న అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఇందుకు కారణం న్యూజెర్సీ పోలీస్ ఛీప్ శనివారం జరగనున్న అంత్యక్రియలకు దూరంగా ఉండాలని కోరాడు. అంతేకాకుండా అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి వచ్చి గొడవలు, గలాటాలు సృష్టిస్తే తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని గట్టిగా చెప్పారు. హూస్టన్ అంత్యక్రియలు జరిగే చర్చిలోకి న్యూజెర్సీ పోలీసులు సింగల్ కెమెరాని మాత్రమే అనుమతించారు. ఈ ఒక్క కెమెరాతో అభిమానుల కోసం హూస్టన్ అంత్యక్రియలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
న్యూజెర్సీలోని నేవార్క్ న్యూ పోప్ బాప్టిస్ట్ చర్చికి రావడం కంటే హూస్టన్ అంత్యక్రియల్ని టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండని సలహా ఇచ్చారు. ఇది ఇలా ఉంటే నిరాడంబరంగా జరిగే హూస్టన్ అంత్యక్రియలకు ఎంపిక చేసిన పది, పదిహేను మంది ప్రముఖ వ్యక్తులు మాత్రమే హాజరవుతున్నారు. హూస్టన్ అంత్యక్రియలకు హాజరయ్యే వారిలో చాకా ఖాన్, బేబే అండ్ సేసే వినాన్స్, డయానే వారెన్, పాప్ సింగర్ డార్లేనే లవ్, బిషప్ టీడీ జేక్స్, అంటానియో లా రీడ్, రేజే అండ్ బ్రాండీలు ఉన్నారు.
48 సంవత్సరాల వయసు కలిగిన అమెరికాకు చెందిన పాప్ గాయని, నటి వైట్నీ హాస్టన్ లాస్ ఏంజిల్స్‌లో గత ఆదివారం మృతి చెందినట్లు ఆమె కుటుంబ ప్రతినిధి క్రిస్టెన్ ఫోస్టర్ హాస్టన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. ఐతే ఆమె మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించ లేదు. ఇక వైట్నీ హాస్టన్ న్యూజెర్సీలో పెరగడం వల్ల మొదట ఓ చర్చిలో పాడగా.. ఆ తర్వాత నైట్ క్లబ్స్‌లోనూ సింగర్‌గా పని చేశారు.
ఆ తర్వాత మోడల్.. వైట్నీ హాస్టన్ సింగర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈమె విడుదల చేసిన చాలా ఆల్బమ్స్ ప్రజాదరణ పొందడమే కాకుండా.. రికార్డు స్దాయి లాభాలను తెచ్చిపెట్టాయి. 1980 - 90 మద్యలో ఎన్నో అవార్డులను గెలుపొందారు. హాలీవుడ్లో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన ది బాడీగార్డ్, వెయిటింగ్ టు ఎక్సేల్ సినిమాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











