»   » విడ్డూరం: కొడుకులతో హీరోయిన్ హాట్ ఫోజులు (ఫోటోలు)

విడ్డూరం: కొడుకులతో హీరోయిన్ హాట్ ఫోజులు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ఏంజిల్స్: దీన్ని విడ్డూరం అనాలో? ఇంకేం అనాలో అర్థం కావడం లేదు. అమెరికన్ సూపర్ మోడల్, నటి స్టోఫానీ సీమర్ తన ఇద్దరు కొడుకులతో కలిసి ఓ మేగజైన్ కోసం ఫోటో షూట్లో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ 'హార్పర్స్ బజార్' మేగజైన్ కోసం ఆమె తన ఇద్దరు కొడుకులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మార్చి నెలలో విడుదలయ్యే మేగజైన్ కోసం ఈ ఫోటో షూట్ జరిగింది.

స్టెఫానీ సీమర్ కుమారులు 20 ఏళ్ల వయసున్న పీటర్, 17 ఏళ్ల వయసున్న హ్యారీ ఈ ఫోటో షూట్లో పాలు పంచుకున్నారు. చూడటానికి ఈ ఫోటో షూట్ కాస్త తేగా అనిపించినా....... ఈ ఫోటో షూట్ వెకన ఉద్దేశ్యం మాత్రం తేడా కాదు. ఫ్యాషన్ ప్రపంచంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న తన ఇద్దరు కుమారులను లైమ్ లైట్‌లోకి తేవడంలో భాగంగా అందరి దృష్టినీ ఆకర్షించడానికి ఈ ఫోటో షూట్ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

మెడలింగ్ అనేది తమ ప్రొఫెషన్, ఒక సూపర్ మోడల్ ఫ్యామిలీ నుండి మేం వచ్చాం. తమ ప్రొఫెషన్లో భాగంగానే ఇలాంటి ఫోటో షూట్లో పాల్గొనడం జరిగిందని అంటున్నారు. స్టెఫానీ సీమర్, ఆమె కుమారులకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

స్టెఫానీ సీమర్

స్టెఫానీ సీమర్


స్టెఫానీ సీమర్. అమెరికాకు చెందిన ప్రముఖ సూపర్ మోడల్, నటి. స్టోఫానీ సీమర్ వయసు 45 ఏళ్లు.

కెరీర్

కెరీర్


16 ఏళ్ల వయసులోనే స్టెఫానీ సీమర్ మోడలింగులోకి అడుగు పెట్టింది. కెరీర్ తొలి నాళ్లలో లోకల్ న్యూస్ పేపర్లు, డిపార్టమెంట్ స్టోర్ల కోసం మోడలింగ్ మొదలు పెట్టిన స్టెఫానీ సీమర్ ఆ తర్వాత అమెరికన్ టాప్ సూపర్ మోడల్‌గా ఎదిగింది.

నటిగా...

నటిగా...


తొలుత స్టెఫానీ సీమర్ ‘హెల్ : ఎ సైబర్‌పుంక్ థ్రిల్లర్' అనే వీడియో గేమ్ కోసం నటించింది. 2000 సంవత్సరంలో ‘పొల్లాక్' అనే చిత్రం నటించింది. 2002లో ‘లా అండ్ ఆర్డర్ : క్రిమినల్ ఇంటెంట్' అనే టీవీ కార్యక్రమం కోసం నటించింది.

పర్సనల్ లైఫ్

పర్సనల్ లైఫ్


16 ఏళ్ల వయసులోనే స్టెఫానీ సీమర్ డేటింగ్ మొదలు పెట్టింది. ‘ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్' హెడ్ జాన్ కాసబ్లాంకాస్‌తో డేటింగ్ చేసింది. 1989లో గిటారిస్ట్ టామీ ఆండ్రివ్‌ను పెళ్లాడిన స్టెఫానీ సీమర్ 1990లో అతనితో విడిపోయింది. ఆ తర్వాత స్టెఫానీ సీమర్ అమెరికన్ పారిశ్రామిక వేత్త, వ్యాపార వేత్త పీటర్ బ్రాంట్‌ను 1995లో పెళ్లాడింది. 2009లో విడిపోయిన వీరు 2010లో మళ్లీ రాజీ పడి కలిసే ఉంటున్నారు. స్టెఫానీ సీమర్‌కు నలుగురు సంతానం.

Photos via Facebook/Harper's Bazaar

English summary
Supermodel Stephanie Seymour is clearly one of the hottest moms on the planet, and if her close relationship with her two sons — 20-year-old Peter Brant Jr. and 17-year-old Harry Brant — is any indication, she’s also one of the sweetest. The family stars in its first mother-son fashion editorial in the March issue of Harper’s Bazaar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu