For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాట్లీ మరణానికి కారణం అదా??

    By Kuladeep
    |

    'బాయ్ జోన్' బ్యాండ్ సింగర్ దివంగత స్టిఫెన్ గ్యాట్లీ మరణానికి కాన్నాబిస్ అనే మాదకద్రవ్యమే కారణమనే అనుమానాలు వినిపిస్తున్నాయి. గత శనివారం మల్లోర్కా లోని తన అపార్ట్ మెంట్ లో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణం పై రోజుకో కారణం ప్రచారంలోకి వస్తోంది. తాజా ఆయన మరణించడానికి ముందు కాన్నాబిస్ అనే మాదకద్రవ్యాన్ని తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

    ఈ విషయాన్ని ఆయన 'గే' భాగస్వామి ఆండీ కౌలేస్ కూడా దృవీకరించాడట. స్టిఫెన్ గ్యాట్లీ మరణించడానికి ముందు తన భాగస్వామి ఆండీ తో కలసి వున్నాడు. ఇద్దరూ కలసి మద్యం సేవించినట్టు ఆ తర్వాత గ్యాట్లీ ఈ మాదకద్రవ్యాన్ని తీసుకున్నాడట. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. ఉదయం లేచే సరికి గ్యాట్లీ మరణించి వున్నాడు. దీంతో ఆయన మరణానికి అతిగా మద్యం తాగడమే కాకుండా, మాదకద్రవ్యం కూడా కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గ్యాట్లీ అంత్యక్రయలు ఈ శనివారం నిర్వహించనున్నారు. అంత లోపు మరెన్ని కారణాలు వెలుగు చూస్తాయో చూడాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X