రాజమౌళి RRR సినిమాకు మరో అగ్ర హాలీవుడ్ దర్శకుడు ఫిదా.. ఎగిరి గంతేసే రేంజ్ లో రాజమౌళి ఆనందం
దర్శకధీరుడు రాజమౌళి స్థాయి ఏ రేంజ్ లో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి తర్వాత RRR సినిమా ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అక్కడ సినీ ప్రముఖులు టెక్నీషియన్స్ చాలావరకు RRR సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఇటీవల మరో అగ్ర హాలీవుడ్ దర్శకుడు కూడా ప్రత్యేకంగా వీడియో కాల్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఇక అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో RRR హైలెట్
రాజమౌళి ఎలాంటి సినిమా తీసిన కూడా మంచి యాక్షన్ ఎమోషన్ కంటెంట్ తో అందరికీ కనెక్ట్ అయ్యేలా చేస్తుంటాడు. ఇక RRR సినిమాలో ఈసారి ఆ కంటెంట్ మరింత ఎక్కువ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. హాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమాను చూసి ఎంతగానో ప్రశంసలు కురిపించారు. అక్కడ దర్శకులు టెక్నీషియన్స్ కూడా సోషల్ మీడియాలో రాజమౌళి పనితీరుని ఎంతగానో మెచ్చుకున్నారు.

టైటానిక్ దర్శకుడు ఫిదా
ఇదివరకే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో చిత్ర యూనిట్ కు మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ సాంగ్ అవార్డును కూడా అందుకున్నారు. అప్పుడే టైటానిక్, అవతార్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ కూడా దర్శకుడు రాజమౌళి పై ప్రశంసలు కురిపించాడు. అలాగే హాలీవుడ్లో సినిమా చేయాలని ఉంటే ఒకసారి సంప్రదించమని కూడా ఆయన అనడం విశేషం

స్టీవెన్ స్పిల్ బర్గ్ కూడా..
అయితే ఇప్పుడు రాజమౌళి పని తీరుపై మరి కొంతమంది హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పొగుడుతూ ఉండడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో అగ్రప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్క్ దృష్టిని కూడా రాజమౌళి ఆకర్షించాడు. ఇండియానా జోన్స్, జూరాసిక్ పార్క్ సృష్టికర్త స్టీవెన్ రాజమౌళిని ఎంతగానో లైక్ చేశారు. ఒక సినిమా రిలీజ్ సందర్భంగా ప్రత్యేకంగా రాజమౌళితో వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనడం విశేషం.

రాజమౌళి సంతోషం
స్పిల్ బర్గ్ మాట్లాడడంతో రాజమౌళి ఎంతగానో పొంగిపోయాడు. ముందుగా స్టీవెన్ హాయ్ ఎస్ఎస్ అంటూ.. నేను నీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. నీ RRR సినిమా అవుట్ స్టాండింగ్ అంటూ ఆయన పొగడ్తలతో రాజమౌళి ఆనందం కట్టలు తెంచుకుంది. నాకు వెంటనే కుర్చీలో నుంచి లేచి డాన్స్ చేయాలని ఉందని రాజమౌళి ఆయనకు సమాధానం ఇచ్చాడు. దీంతో స్పిల్ బర్గ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
ఆ సినిమా విడుదల సందర్భంగా..
అయితే ఇంత సడన్ గా రాజమౌళి ని స్టీవెన్ ఎందుకు ఇంటర్వ్యూ చేశారంటే త్వరలోనే ఆయన దర్శకత్వం వహించిన దా ఫేబుల్ మాన్స్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన ప్రత్యేకంగా రాజమౌళితో ఒక లైవ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇక యూట్యూబ్లో అది రిలీజ్ కాబోతోంది. ఇక ఫుల్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఇంకా ఆయనకు ఇష్టమైన దర్శకుడిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











