ఇంగ్లాండ్ నాచురల్ బ్యూటీని వర్ణించడానికి రెండు కళ్శుచాలవు..!
ప్రపంచం మొత్తం గర్వించ దర్శకులలో ఒకరు స్టీవెన్ స్పీల్ బర్గ్. తన నలభై సంవత్సరాల సినీ ప్రస్దానంలో ఎన్నో మైలు రాళ్శు లాంటి సినిమాలు తీశారు. హాలీవుడ్ కిమొట్టమొదట సైన్స్ ఫిక్షన్ మరియు ఎడ్వంజర్ సినిమాలను పరిచయం చేశారనడంలో ఆశ్చర్యపోనక్కరలేదు. తనకంటూ ఓ సోంత నిర్మాణ సంస్ధ ఉండాలంటూ డ్రీమ్ వర్క్స్ అనే స్టూడియోని ప్రారంభించారు. బెస్ట్ డైరెక్టర్ గా 1993లో స్కండ్లర్స్ లిస్ట్ అనే సినిమాకు గాను మొట్టమొదట సారి ఆస్కార్ అవార్డు తీసుకున్నారు. వెంటనే1998లో సేవింగ్ ప్రయివేట్ రెయిన్ అనే సినిమాకు రెండవ సారి ఆస్కార్ అవార్డు తీసుకన్నారు. అంతేకాకుండా ఆయన తీసినటువంటి జురాసిక్ పార్క్, ది ఎక్ట్రా టెరిస్టియల్ లాంటి చిత్రాలు ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్జుల్ని నమోదు చేశాయి.
ప్రస్తుతం 'వార్ హార్స్' అనే బ్లాక్ బాస్టర్ సినిమా షూటింగ్ నిమిత్తం ఇంగ్లాండ్ లోని డార్ట్ మోర్ లో ఉన్నారు స్టీవెన్ స్పీల్ బర్గ్. గత కోన్ని వారాలుగా షూటింగ్ తీస్తున్న దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇటీవలే సినిమా గురించి కోన్నివిషయాలను మీడియాతో చర్చించారు. నా నలభైయేళ్శ సినీ జీవితంలో ఇలాంటి అందమైన లోకేషన్ ను నేను ఇంతవరుకు చూడలేదని అన్నారు. నేను చూడగానే మొట్టమొదట సారి మైమరిచిపోయేటటువంటి అందంగా ఉంది ఈడార్ట్ మోర్ ప్రకృతి మరియు పచ్చదనం.
21/2వారాల పాటు ఈఅందాలను మాకెమోరా లోబందించడం జరిగింది. ఈఅందాలను చూసిన తర్వాత నాకు ఇంక ఎలాంటి విజువల్ ఎఫెక్ట్సు అవసరం లేదని అనిపించిందన్నారు. ఇక సినిమా 'వార్ హార్స్' విషయానికి వస్తే మైఖెల్ మార్పర్గో నవల ఆధారంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. మొట్టమొదటి ప్రపంచ యుద్దంలో గుర్రాల పాత్ర ఎంతవరుకు ఉందనే కధాంశంతో సినిమాని రూపోందిస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications











