twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిథివేటే...స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ కొత్త చిత్రం

    By Srikanya
    |

    న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ గురించి తెలియని వారు సినీ ప్రియులు అరుదు. ఆయన సినిమా అంటే అందరికీ ఆసక్తే. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి చూసేలా సినిమాలు డిజైన్ చేస్తూంటారు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. అయితే కొద్ది కాలంగా విజయానికి దూరంగా ఉన్న ఈ దర్శకుడు ఈ సారి మాత్రం ఖచ్చితంగా హిట్ కొడతాననే థీమాగా ఉన్నారు. తనకు కలిసి వచ్చిన, ఇష్టమైన నిధి వేటతో మళ్లీ ముందుకు వస్తున్నాడు. ఆయన తాజా చిత్రం విశేషాలకు వస్తే...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రస్తుతం 'బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌', 'ది బిఎఫ్‌జి' సినిమాలతో బిజీగా ఉన్న స్పీల్‌బర్గ్‌ మరో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఎర్నీ క్త్లెన్‌ రచించిన 'రెడీ ప్లేయర్‌ ఒన్‌' అనే సైంటిఫిక్‌ ఫిక్షన్‌ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు.

    ఒయాసిస్‌ అనే కాల్పనిక జగత్తులో నిధి వేటకు బయలుదేరిన ఓ టీనేజ్‌ బాలుడు శత్రువుల బారి నుంచి తప్పించుకుని ఎలా నిధిని చేజిక్కించుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జాక్‌పెన్‌ స్క్రిప్టు సమకూరుస్తున్నారు. 'ది బిఎఫ్‌జి' చిత్రం కూడా మరో నవల ఆధారంగానే రూపొందిస్తుండటం విశేషం.

    Steven Spielberg To Direct Sci-Fi Cult Favorite ‘Ready Player One'

    గత కొద్దికాలం నుండి స్టీఫెన్ స్పీల్‌బర్గ్ దర్శకుడిగా ఎక్కడా కనిపించలేదు. ‘కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్స్, టిన్ టిన్, వార్ హార్స్' లాంటి సినిమాలు వచ్చి నా అవేవీ స్పీల్‌బర్గ్ దర్శకత్వ ప్రతిభకు తగినవి కావు. దాంతో ఆయన అభిమానులు ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు.

    మరో ప్రక్క

    స్పీల్ బర్గ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన 'జురాసిక్‌ పార్క్‌...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. డైనోసార్ల గురించి ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు 'జురాసిక్‌ వరల్డ్‌' పేరుతో మరో కొత్త సీక్వెల్‌ తెరకెక్కుతోంది.

    ఈ సినిమాను వైవిధ్యమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఈ తాజా చిత్రం కోసం 7 రకాల కొత్త తరహా డైనోసార్‌లను రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన నమూనాలను సైంటిస్టులు తయారు చేసిన విధానాన్ని జురాసిక్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో వీడియో, ఫొటోల రూపంలో సినిమా అభిమానులకు అందిస్తున్నారు.

    డైనోసార్లు మళ్లీ పుట్టాయేమో అన్నంత సహజంగా ఉన్న ఆ జీవులను చూసి వీక్షకులు ఆశ్చర్యపోతున్నారట. జురాసిక్‌ పార్క్‌ సందర్శకులకు ఈ కొత్త జీవులను చూసే అవకాశం కల్పించడం విశేషం. ఈ చిత్రాన్ని అమెరికాలో జూన్‌ 12న విడుదల చేస్తున్నారు.

    ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 12, 2015న ఈ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది.

    English summary
    Steven Spielberg is set to direct Ready Player One, the highly anticipated project based on the popular sci-fi book by Ernest Cline that takes place in a virtual world. What a coup for Warner Bros, which will bring it to the screen along with Village Roadshow. This is expected to be Spielberg’s next movie after The BFG.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X