twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాయ్ ప్రెండ్‌ స్నేహాం చేస్తే.. అంత ఖరీదైన బహుమతా....?

    By Nageswara Rao
    |

    ట్విలైట్, న్యూమూన్ లాంటి బాక్సాఫీస్ చిత్రాల్లో నటించిన క్రిస్టినా స్టివార్ట్ తన ప్రియుడు రాబర్ట్ ప్యాటిన్సన్‌తో చేస్తున్న స్నేహాం మూడు సంవత్సరాలైన సందర్బంగా 50,000 పౌండ్ల విలువ చేసే ఒక పియానో కోనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది.

    క్రిస్టెన్ తన బాయ్ ప్రెండ్‌కి ఆశ్చర్యం కలిగించే బహుమతినిన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దీనిని కొనుగోలు చేసిందని క్రిస్టెన్ అధికార ప్రతినిధి తెలిపారు. తన జీవితంలో అభిమానులు, చిత్రకారులతో ఎల్లప్పుడూ పుల్ బిజీగా జీవించే రాబర్ట్ ప్యాటిన్సన్ అప్పుడప్పుడు వేరే ప్రపంచంలోకి వెళ్లేందుకు ఈ పియానోని ప్లే చేసే అలవాటుని అలవర్చుకున్నాడు.

    రాబర్ట్ ప్యాటిన్సన్‌ ఒంటరిగా ఉన్న సమయంలో ఆలోచింపజేసే ఆలోచనలు, భావోద్వేగ మరియు సృజనాత్మక పొందుటకు పియానోని ప్లే చేస్తాడని సమాచారం. రాబర్ట్ ప్యాటిన్సన్‌ ఇష్టాన్ని తెలుసుకోని ధరను కూడా ఆలోచించకుండా బాయ్ ప్రెండ్ కోసం క్రిస్టినా స్టివార్ట్ ఈ బహుమతిని అందించిందని ఆమెని అభినందిస్తున్నారు.

    ప్రపంచంలో సెక్సీయస్ట్ మ్యాన్ ఎవరూ అంటూ ఇటీవల హాలీవుడ్లో టాప్ 50 మంది సెలబ్రటీలను తీసుకొని ఓ సర్వే నిర్విహించడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా సెక్సీయస్ట్ మ్యాన్‌ స్దానాన్ని కైవసం చేసుకుంటున్న ట్విలైట్ స్టార్ 'రాబర్ట్ ప్యాటిన్సన్‌'నే ఈసారి కూడా నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక మొదటి స్దానం కొసం గట్టి పోటీని ఇచ్చిన ట్విలైట్ సినిమాలో తన కోస్టార్ టేలర్ లాట్నర్ రెండవ స్దానంతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది.

    English summary
    Actress Kristen Stewart has reportedly bought boyfriend Robert Pattinson a piano worth 50,000 pounds on their third anniversary of friendship.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X