ఎంజాయ్ చేయడానికి బ్రిటిష్ పబ్‌లు ఎంత బాగుంటాయో..
సాధారణంగా సెలబ్రిటీలు పబ్‌లు, బార్లకు వెళుతూ ఉంటారు. కొంత మంది సెలబ్రీలు నాకు ఈ పబ్ నచ్చింది, నాకు ఈ పబ్ నచ్చలేదు అంటూ వారియొక్క మనోభావాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ట్విలైట్ స్టార్ క్రిస్టినా స్టివార్ట్ కూడా ఇటీవల ట్విలైట్ సిరిస్ ప్రమోషన్‌లో భాగంగా లండన్ వెళ్లడం జరిగింది. సినిమా ప్రమోషన్ అయి పోయిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకులే అని బ్రిటిష్ పబ్‌కి వెళ్లడం జరిగింది. పబ్‌కి వెళ్లిన తర్వాత మరి ఇంకెందుకు ఆలస్యం అంటూ అక్కడున్న రోస్ట్ డిన్నర్‌తో పాటు, బీర్‌ని లాగించేసింది.
స్వతహాగా అమెరికన్ స్టార్ హీరోయిన క్రిస్టినా స్టివార్ట్ ప్రస్తుతం ట్విలైట్ సాగా సిరిస్‌లో తనతో పాటు నటించిన హాలీవుడ్ రొమాంటిక్ హీరో రాబర్ట్ ప్యాట్రిన్సన్‌తో డేటింగ్ చేస్తుంది. హాలీవుడ్లో డేటింగ్ అంటే పబ్‌లు, షాఫింగ్స్ షికార్లు అన్నీ మామూలు అన్న విషయం తెలిసిందే. అలా రాత్రుళ్లు వీరిద్దరూ కలిసి పబ్‌కి వెళ్లిన కొన్ని సంఘటలను ఇలా అభిమానులతో సరదాగా పంచుకున్నారు.
స్టీవార్ట్ మాట్లాడుతూ లాస్ ఏంజిల్స్‌లో ఐతే కొన్ని పబ్‌లను సెలక్ట్ చేసుకొని మరీ వెళ్లడం జరుగుతుంది. కానీ లండన్‌లో మాత్రం అలా కాదు. లండన్‌లో అన్ని పబ్‌లు కూడా నాకు తెగనచ్చేయాశాయని తెలిపింది. అంతేకాకుండా నాకు 'Guinness' బీర్ అంటే చాలా ఇష్టం. ఈ బీర్‌తో పాటు రోస్ట్ డిన్నర్ చేస్తుంటే ఆ అనుభూతే వేరని తెలిపింది. లండన్‌లో ఉన్న ఓల్డ్ మ్యాన్ పబ్స్‌లో ఎక్కవగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతానని స్టివార్ట్ ఇటీవల ఓ ఇంటర్యూలో తెలిపింది.
ఇటీవల క్రిస్టినా స్టివార్ట్ ఎక్కడ కనిపించినా అభిమానులు ఆమెని పోగడ్తలతో ముంచెత్తున్నారు. అందుకు కారణం 21 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టినా స్టివార్ట్ 'జిక్యూ మ్యాగజైన్' లేటెస్ట్ కవర్ పేజిపై బ్లాక్ బికినీలో దర్శనం ఇచ్చారు. జిక్యూ మ్యాగజైన్ కవర్ పేజిపై క్రిస్టినా స్టివార్ట్ పుల్ మేకప్‌తో ఫోజు ఇవ్వడం జరిగింది.


Click it and Unblock the Notifications











