ఆ డ్రస్సులో నిజంగా పెళ్లి కళ వచ్చింది..
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్, హీరోయిన్‌గా నటించిన 'ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' క్రిస్ మస్‌కు విడుదలై బాక్సాఫీసు విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ సందర్బంలో జరిగిన కొన్ని సన్నివేశాలను డిజైనర్ 'కరోలినా హీర్రెర' అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ 21 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టెన్ స్టీవర్ట్ ఈ సినిమాలో బెల్లా స్వాన్ పాత్రలో తనదైన శైలిలో ఒదిగిపోయారన్నారు.
ఈ పాత్రలో ఎంతలా ఒదిగిపోయారంటే బెల్లా స్వాన్, చక్కవర్తి ఎడ్వర్డ్ కల్లెన్ అనే చక్రవర్తిని పెళ్లి చేసుకునే సీనులో అచ్చం రాకుమారి లాగా నటించమంటే జీవించారని అన్నారు. ఇక ఈ సీన్‌లో క్రిస్టెన్ స్టీవర్ట్ నిజ జీవిత ప్రేమికుడు అందగాడు 'రాబర్ట్ ప్యాట్రిన్సన్' చక్రవర్తి స్దానంలో నటించారు. క్రిస్టెన్ స్టీవర్ట్‌కి పెళ్లి సీనులో మేము మూడు డ్రస్సులను ఏర్పాటు చేశాం. అందులో మొదటి డ్రస్సు క్రిస్టెన్ స్టీవర్ట్ ధరించగానే అచ్చం పెళ్లి కళ వచ్చిన అమ్మాయి లాగా ఉంది. ఆ డ్ర్రస్సు ధరించిన వెంటనే క్రిస్టెన్ స్టీవర్ట్ మిర్రర్ వద్దకు వెళ్లి తనకు డ్రస్సు ఖచ్చితంగా సరిపోయిందా లేదా అంటూ చూసిన సీన్ మా అందరికి ఇప్పటికీ కళ్ల ముందు మెదలాడుతూనే ఉంది.
డిజైనర్‌గా నాకైతే క్రిస్టెన్ స్టీవర్ట్ చూసేందుక రెండు కళ్లు చాల్లేదని చెప్పాలి. క్రిస్టెన్ స్టీవర్ట్ చూసిన వారంతా ఈ సీన్‌లో నిజమైన పెళ్లి కూతురు కూడా నీ అంత అందంగా ఉండదని అన్నారు.


Click it and Unblock the Notifications











