మ్యూజియం చరిత్రలోనే రికార్డు సృష్టించిన హీరోయిన్
21 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టనా స్టివార్ట్ ట్విలైట్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్రిస్టినా స్టివార్ట్ హీరోయిన్‌గా నటించిన 'ట్విలైట్ ద బ్రేకింగ్ డాన్ పార్ట్ 1' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ వయసులో స్టార్ డమ్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న క్రిస్టినా స్టివార్ట్ గురించి అందిరి తెలిసేలా ఈమె మంచు శిల్పం ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించనున్నారు.
క్రిస్టినా స్టివార్ట్ మంచు శిల్పాన్ని నిజ జీవితంలో తన బాయ్ ప్రెండ్ హాలీవుడ్ అందగాడు రాబర్ట్ ప్యాట్రిన్సన్ మరియు వ్యాంపైర్ సాగాలో తనతో పాటు కలసి నటించిన టేలర్ ఇద్దరీ మద్య ఈ శిల్పాన్ని ప్రతిష్టించనున్నారు. క్రిస్టినా స్టివార్ట్ మంచు శిల్పాన్ని కేవలం రెండు రోజులు మాత్రమే ప్రదర్శనకు ఉంచనున్నామని మ్యూజియం అధికారులు తెలియజేశారు. మ్యూజియం చరిత్రలో మొట్టమొదటి సారి క్రిస్టినా స్టివార్ట్ మంచు శిల్పాన్ని ఇక్కడ ప్రదర్శించనున్నారు.
ఇదే టుస్సాడ్ మ్యూజియంలో గతంలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్, ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్, మాధురీ దీక్షిత్ తదితరులు శిల్పాలను ప్రదర్శించన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











