'ఆన్ ద రోడ్' లో టాప్‌లెస్‌గా నటించిన హీరోయిన్
ట్విలైట్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టివార్ట్ 'ఆన్ ద రోడ్' సినిమాలోని పాత్ర డిమాండ్ చేసిందని టాప్ లెస్‌గా నటించారు. ఈ సినిమాని జాక్ కెరౌయాక్ యొక్క నవల ఆధారంగా తీస్తున్నారు. ఈ సినిమాలో 21సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టెన్ స్టివార్ట్ యొక్క అందాలను కెమెరాల ద్వారా పలు యాంగిల్స్ చూపించి చూపించకుండా.. కనిపించి కనిపించకుండా తీస్తున్నట్లు సమాచారం.
ఇక ఇటీవలే క్రిస్టెన్ స్టివార్డ్ నటించిన అడ్వంచర్ డ్రామా సినిమా ప్రీమియర్ గాను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరైన విషయం తెలిసిందే. ఈ అడ్వంచర్ సినిమాలో క్రిస్టెన్ డంస్ట్, ఆమె ఆడమ్స్, స్టీవ్ బుసెమీ తదితరులు క్రిస్టెన్ స్టివార్డ్‌తో కలసి నటించారు. ట్విలైట్ సినిమాలో క్రిస్టివా స్టివార్ట్ పోషించిన బెల్లా స్వాన్ పాత్రను చూసి మంత్ర ముగ్దులైన వార్నర్ బ్రదర్స్ యాజమాన్యం జపనీస్ యానిమేషన్ మూవీ అకీరాలో లీడ్ రోల్ పోషించాల్సిందిగా కొరడం జరిగింది.
వార్నర్ బ్రదర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కనేడ, టూసూ అనే ప్రధాన పాత్రలు ఉంటాయి. 2019వ సంవత్సరంలో టొక్యోలో జరగనున్న న్యూక్లియర్ వార్ గురించి సినిమా ఉంటుందని సమాచారం. ఈసినిమాకి సంబంధించిన పూర్తి షూటింగ్ అంతా న్యూయార్క్ లోనే తీయడం జరగుతుందని తెలిపారు. టూసూ అనే పాత్రకు గాను మిల్లర్, ఆల్డెన్ ఎన్రిచ్‌లలో ఎవరినో ఒకరిని తీసుకొవాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











