twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గే' కమ్యూనిటీపై జరుగుతున్న దాడులను ఆపండి: జాన్

    By Nageswara Rao
    |

    లండన్, జూన్ 2: ఉక్రెయిన్‌లో ప్రముఖ హాలీవుడ్ గాయకుడు ఎల్టన్ జాన్ స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు త్వరలో ఓ ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ రాజధాని కివ్‌లో ఎయిడ్స్ ఛారిటీ అవగాహాన కార్యక్రమంలో పాల్గోనడానికి వచ్చిన 'రాకెట్ మ్యాన్' హిట్ మేకర్ ఎల్టన్ జాన్ స్వలింగ సంపర్కులకు మొదటి నుండి వత్తాసు పలుకుతున్న విషయం తెలిసిందే.

    దేశంలోని వార్తాపత్రిక నివేదికలు ఆధారంగా స్వలింగ సంపర్కుల మీద దాడులు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న ఎల్టన్ జాన్ ఈ కార్యక్రమంలో బావోద్వేగంతో ప్రసంగించారు. ఈ ప్రసంగం మధ్యలో పాటలతో పాటు స్వలింగ సంపర్కులకు తన పూర్తి మద్దతు ఉంటుందని.. వారిపై హింసను ఆపాలని సూచించారు.

    ఈ క్రింది విధంగా ఎల్టన్ జాన్ ప్రసంగం సాగింది. ఉక్రెయిన్‌లో ఉన్న స్వలింగ సంపర్కుల మీద దాడి విషయమై ఇటీవల నేనొక ఆర్టికల్ చదివాను. స్వలింగ సంపర్కులను కొట్టడం అనేది చాలా బాధాకరం, తప్పు. ఈ విషయంలో నాకు ఉక్రెయిన్ చిహ్నంగా లేదు. నేను మిమ్మల్ని ఒక విజ్ఞప్తిని విన్నవించుకుంటున్నాను, దయ చేసి స్వలింగ సంపర్కుల వ్యతిరేకంగా జరుగుతున్న హింసను ఆపండని అన్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Singer Elton John has called for an end to violence against gay people following a spate of homophobic attacks in Ukraine. The “Rocket Man” hitmaker performed at an Aids charity concert in Kiev Saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X