twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరకు బాండ్ గర్ల్‌గా ఆసెక్సీ భామనే ఎంపిక చేశారు!

    By Nageswara Rao
    |

    అమెరికన్ గూఢాచారి వ్యవస్దకు నిలువత్తు నిదర్శనం జేమ్స్ బాండ్ అనే పాత్ర. ఈ జేమ్స్ బాండ్ పని ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా జాతి వినాశక పనులు చేస్తున్నవారిని గ్రహించి చివరకు వారి ఆట కట్టించడమే. ఐతే జేమ్స్ బాండ్ క్యారెక్టర్ వేసే హీరోలలో దమ్ము, ధైర్యం కొట్టోచ్చినట్లు కనిపించాలి. అందులో బాగంగానే ప్రస్తుతం జురుగుతున్న జేమ్స్ బాండ్ సిరిస్ సినిమా రోల్‌కి డేనియల్ గ్రెగ్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. డేనియల్ గ్రెగ్ జేమ్స్ బాండ్‌గా రెండు సినిమాలు పూర్తి చేశారు. త్వరలో డేనియల్ గ్రెగ్ జేమ్స్ బాండ్‌గా మూడవ సినిమా రూపోందిస్తున్నారు.

    జేమ్స్ బాండ్ సినిమాలలో జేమ్స్ బాండ్ ఎంత ముఖ్యమో అతని ప్రక్కన ఉండేటటువంటి హీరోయిన్ కూడా చాలా ముఖ్యం. దానికి కారణం జేమ్స్ బాండ్ సినిమాలలో దేశాన్ని దుష్టశక్తుల నుండి హీరో రక్షించాలంటే ఎన్నో సాహస కార్యక్రమాలు, దైర్య సాహాసాలు చేయాల్సి వస్తుంది. అటువంటి సమయంలో బాండ్ గర్ల్ అతనికి చేదోడు వాదోడుగా ఉండాల్సి వస్తుంది. అందుకే బాండ్ గర్ల్‌గా నటించాలంటే వారికి కొన్ని అర్హతలను నిర్ణయించారు జేమ్స్ బాండ్ సినిమా నిర్మాతలు.

    ఇది ఇలా ఉంటే 23వ జేమ్స్ బాండ్ చిత్రంలో బాండ్ ప్రేయసిగా రష్యన్ భామ మార్గరీటా లెవీవా(31) నటించనున్నట్లు 'డెయిలీ మెయిల్ ఆన్‌లైన్" పేర్కొంది. ఇప్పటికే బాండ్ నిర్మాతల దృష్టి ఆ ముద్దుగుమ్మపై పడిందని.. డేనియల్ గ్రెగ్‌కు జోడీగా మార్గరీటా నటించనుందని తెలిపింది. పరిపూర్ణమైన బాండ్ గర్ల్ అందం, ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటంతోపాటు ఏదో మర్మం దాగి ఉన్న యువతిలా కనిపించాలని.. ఆ లక్షణాలన్నీ మార్గరీటాలో ఉన్నాయని చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్‌లో బాండ్ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని డెయిలీ మెయిల్ ఆన్‌లైన్ తెలిపింది.

    English summary
    But if she signs on to the currently unnamed upcoming Bond film, starring Daniel Craig who will be playing the iconic spy for the third time, her fortunes are likely to take a turn for the better.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X