మొనగాళ్లంతా వస్తున్నారు, కాచుకోండి.. హాలీవుడ్ సినిమా కోసం ఇంతగానా, ఊహకందని అవెంజర్స్!

Recommended Video

'Avengers: Infinity War' Potentially Heading To $500 Million Worldwide Opening

ఓ హాలీవుడ్ చిత్రం ఇండియాలో విడుదలవుతుందంటే చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. కానీ తొలిసారి ఓ హాలీవుడ్ యాక్షన్ చిత్రం గురించి ప్రతి చోటా చర్చ జరుగుతోంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతీయ స్థానిక చిత్రాలకు ధీటుగా ఈ చిత్రానికి టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సూపర్ హీరోలంతా ఏకమై ఈ చిత్రంలో నటించారు. కళ్ళు చెదిరే ఫాంటసీ మూవీ కోసం ఇండియాలో సినీప్రియులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్వాల్ స్టూడియో సంస్థ నుంచి గతంలో ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా, స్పైడర్ మాన్ వంటి సూపర్ హీరో చిత్రాలు వచ్చాయి. వీరంతా ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్న చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్.

అతిపెద్ద శత్రువు అంతం కోసం

అతిపెద్ద శత్రువు అంతం కోసం

మార్వల్ సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని అతిపెద్ద విలన్ తానొస్ నుంచి రక్షించడమే ఈ చిత్ర కథ. అద్భుత విన్యాసాలు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో అవెంజర్స్ చిత్రం భారతీయ సినీ ప్రియులని అలరించడానికి సిద్ధంగా ఉంది.

అద్భుతమైన రివ్యూలు

అద్భుతమైన రివ్యూలు

అవెంజర్స్ చిత్రానికి ఇప్పటికే అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఈ చిత్ర ప్రీమియర్ షోలు ఏప్రిల్ 23 న ప్రదర్శించబడ్డాయి. అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. సినీ విశ్లేషకుల చెబుతున్నా మాట ప్రకారం అవెంజర్స్ చిత్రం కమర్షియల్ చిత్రాలకు బాబులాంటి సినిమా అని అంటున్నారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ప్రపంచ వ్యాప్తంగా 1600 వందల కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

200 కోట్లు పక్కా

200 కోట్లు పక్కా

ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ కు వస్తున్న రెస్పాన్స్ బట్టి అవెంజర్స్ చిత్రం అన్ని హాలీవుడ్ చిత్రాల రికార్డులని ఇండియాలో కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం ఇండియాలోనే ఈ చిత్రం తొలిసారి 200 కోట్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలవబోతుందని అంచనా వేస్తున్నారు.

 కళ్లుచెదిరేలా బుకింగ్స్

కళ్లుచెదిరేలా బుకింగ్స్

ఆన్ లైన్ లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దక్కుతున్న ఆదరణ చూసి ప్రముఖ సంస్థ బుక్ మై షో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విడుదలవుతోంది హాలీవుడ్ చిత్రమా లేక ఇండియా స్టార్ హీరో చిత్రమా అనే అనుమానం కలగక మనదని ఆ సంస్థ ఓ ప్రకటనలోతెలిపింది.

 జంగిల్ బుక్ రికార్డ్ పై కన్ను

జంగిల్ బుక్ రికార్డ్ పై కన్ను

ఇండియాలో విడుదలైన హాలీవుడ్ చిత్రాలలో జంగిల్ బుక్ చిత్రం ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 184 కోట్లు రాబట్టింది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం ఆ రికార్డ్ ని సులువుగా అధికమించే అవకాశం ఉందని అంటున్నారు.

 ఇండియాలో హాలీవుడ్ చిత్రాల సత్తా

ఇండియాలో హాలీవుడ్ చిత్రాల సత్తా

ఇండియాలో వసూళ్ల పరంగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన చిత్రాలు ఇవే.

జంగిల్ బుక్ - 184 కోట్లు

ది అమేజింగ్ సస్పైడర్ మాన్ - 96 కోట్లు

లైఫ్ ఆఫ్ పై - 88 కోట్లు

టైటానిక్ - 84 కోట్లు

ది అవెంజర్స్ - 76 కోట్లు

యాక్షన్ ప్రియులకు విందు భోజనమే

యాక్షన్ ప్రియులకు విందు భోజనమే

అవెంజర్స్ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యాక్షన్ ప్రియులకు విందుభోజనం అని చెప్పొచ్చు. అడుగడుగునా అద్భుతమైన యాక్షన్ తో ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. మార్వల్ స్టూడియో సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X