త్వరలో తండ్రి కాబోతున్న 'సూపర్‌మ్యాన్'
సూపర్ మ్యాన్ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ హీరో బ్రాండెన్ రోత్. సూపర్ మ్యాన్ అనగానే ఠక్కున మదిలో గుర్తుకు వచ్చే విధంగా సూపర్‌మ్యాన్
రిటర్న్స్ సినిమాలో అద్బుతమైన ప్రదర్శనను కనబర్చాడు. సూపర్ మ్యాన్ అభిమానులు అందరూ ఆనందించాల్సిన విషయం ఏమిటంటే బ్రాండెన్ రోత్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. త్వరలో తండ్రి కాబోతున్న బ్రాండెన్ రోత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
ప్రస్తుతం బ్రాండెన్ రోత్ 'సిబిఎస్ పైలెట్ పాట్నర్స్' సినిమాలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ సందర్బంగా సెట్స్‌లో అందరూ మీకు పిల్లలున్నారా అని ప్రశ్నిస్తున్నారని... దీనికి నేను సమాధానంగా ఇంకా లేరని అన్నానని అన్నారు. దీంతో వారు ఇదంతా నిజమేనా.. నమ్మవచ్చా అని అంటున్నారు. ఐతే మొదట్లో నాతో నటించి సహా నటులకు కూడా నాకు త్వరలో పాపాయి పుట్టబోయే విషయం చెప్పలేదని అన్నారు.
బ్రాండెన్ రోత్, కోర్ట్నీ ఫోర్డ్‌ని 2007వ సంవత్సరంలో వివాహాం చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీరికి పిల్లలు పుట్టలేదు. త్వరలో జన్మించనున్న పాప కోర్ట్నీ ఫోర్డ్, బ్రాండెన్ రోత్ దంపతులకు మొదటి పాపాయి. కానీ చివరకు తనతో పాటు నటిస్తున్న 'సిబిఎస్ పైలెట్ పాట్నర్స్' నటిస్తున్న అందరి సహాచరులకు తాను తండ్రి కాబోతున్న విషయాన్ని తెలియజేశానని అన్నారు.


Click it and Unblock the Notifications











