భర్త నుండి విడాకులు.. బాడీ‌గార్డ్‌తో రొమాన్స్

By Nageswara Rao

న్యూయార్క్: సూపర్ మోడల్‌గా పేరుగాంచిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్ హైదీ క్లూమ్ సెలవు దినాలలో తనతో బాగా కలిసిపోయిన బాడీ గార్డ్‌తో డేటింగ్ చేస్తుందంటూ హాలీవుడ్‌లో రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి. 39 సంవత్సరాల వయసు కలిగిన హైదీ క్లూమ్ క్యాట్ వాక్ రాణిగా అందరికి పరిచయం. గత నాలుగు సంవత్సరాలుగా తనకు బాడీ గార్డ్‌గా వ్యవహారిస్తున్న మార్టిన్ క్రిస్టిన్‌తో కలిసి ఇటలీ, సార్డినియా తదితర ప్రదేశాలు పర్యాటన నిమిత్తం ఫ్యామిలీ ట్రిప్ బయలుదేరారు.

ఇదే ట్రిప్‌లో తనతో పాటు వచ్చిన బాడీ గార్డ్‌తో అత్యంత సన్నహితంగా మెలగడం.. అంతేకాకుండా తనతో పాటు డేటింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. వీరిని చూసిన అభిమానులు వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని అచ్చం భార్యభర్తలు మాదిరే అందమైన ప్రదేశాలలో తిరుగుతున్నారని గుసగుసలాడుకంటున్నారు.

ఏడు సంవత్సరాల పాటు కలిసి సంసారం చేసిన తర్వాత తన భర్త, ప్రముఖ సింగర్ సీల్ నుండి జనవరిలో హైదీ క్లూమ్ విడిపోయింది. ఈ జంటకు నలుగురు పిల్లలు లెని (7), హెన్రీ(6), జోహాన్(5), లౌ (2). హైదీ క్లూమ్ ఈ పిటిషన్‌లో తన భర్త నుండి విడాకులను కోరుతూ తన నలుగురు పిల్లల యొక్క ప్రాథమిక భౌతిక అదుపు తనకే చెందాలని పిటిషన్‌లో పేర్కోంది.

హైదీ క్లూమ్, ఆమె భర్త సీల్ ఇద్దరూ త్వరలో విడాకులు తీసుకోనునట్లు విషయం తెలుసుకున్న హైదీ క్లూమ్ తండ్రి గున్థెర్ క్లూమ్ తన విచారాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో గున్థెర్ క్లూమ్ మాట్లాడుతూ ఏడు సంవత్సరాలు కలసి జీవించిన ఈ జంట హాఠాత్తుగా విడిపోతున్నట్లు ప్రకటించడంతో తాను షాక్‌కి గురి అయ్యాయని అన్నారు. ఈ విషయంపై నేను, నా భార్య చాలా విచారంగా ఉన్నామని అన్నారు.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X