ఆమె వేసుకునే దుస్తులు అంటే నాకు చాలా ఇష్టం
లండన్, జులై 26: ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ క్యాటీ హాల్మస్, యాంగ్ ధరించే దుస్తులకు తాను పెద్ద అభిమాని అంటూ సూపర్ మోడల్ హైదీ క్లూమ్ చెబుతుంది. క్యాటీ హాల్మస్, స్టెలిస్ట్ జెన్నే యాంగ్ ఇద్దరూ ధరించే బ్రాండ్‌లో సహకార ప్రయత్నం ఉంటుందన్నారు. ముఖ్యంగా బేసిక్ ఐటమ్స్ విషయంలో వీరు ధరించే లేబుల్ మంచిగా అనిపిస్తుంది.
నా వరకు క్యాటీ హాల్మస్ గ్రేట్ లైన్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం క్యాటీ హాల్మస్ ధరిస్తున్న బట్టలు అన్నీ నాకు చాలా ఇష్టం. ఆమె చాలా అందమైన స్ఫగెట్టి-పట్టీ కామిసోల్స్‌ని కలిగి ఉంది. 39 సంవత్సరాల వయసు కలిగిన హైదీ క్లూమ్ ఇటీవలే తన భర్త సీన్ నుండి విడిపోతున్నట్లు అధికారకంగా ట్విట్టర్లో ప్రకటించింది.
2005వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. హైదీ క్లూమ్ లాస్ ఏంజిల్స్ కోర్టులో తన భర్త నుండి వారం రోజులు లోపు విడాకులు కావాలని కోరుతూ పిటిషన్‌ని దాఖలు చేసింది. ఈ సందర్బంలో సీల్, బైదీ క్లూమ్ పెద్ద కూతురుని పెంచి పోషించే బాధ్యతలను తీసుకున్నారు.
గతంలో హైదీ క్లూమ్ తన యొక్క కాళ్లను $2 మిలియన్లకు ఇన్సూరెన్స్ చేయించారు. హైదీ మాజీ విక్టోరియా సీక్రెట్ మోడల్‌గా వ్యవహారించారు. హైదీ తన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించినప్పుడు హైదీని మీ కాళ్లను మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్నారా అని ప్రశ్నించగా దీనికి సమాధానమిస్తూ నా అంతటగా నేను ఇన్సూరెన్స్ చేయలేదు. నాకు సంబంధించిన క్లయింట్ ఇలా చేయడం జరిగిందని తెలిపారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











