మరణానంతరం అరుదైన రికార్డును సాధించిన మైఖేల్ జాక్సన్..!!
ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మనతోటే వుంటాయి. ఆయన చేసిన పాప్ సాంగ్స్ పాప్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు. కానీ మైఖేల్ తన మరణానంతరం ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అదేంటి అంటే 2009వ సంవత్సరానికి గాను అత్యధిక ఆల్బమ్ లు అమ్మడయిన మ్యూజిక్ ఆర్టిస్ట్ గా రికార్డు సృష్టించాడు. 2009 జూన్ 25న మరణించిన మైఖేల జాక్సన్ ఆల్బమ్ లు 8.2 మిలియన్ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఇవి రెండవ స్థానంలో నిలిచిన టేయిలర్ స్విఫ్ట్(4.6 మిలియన్) అమ్మకాలకు రెట్టింపు.
నెయిల్సన్ సౌండ్ స్కాన్ నిర్వహించిన సర్వే లో ఈ విషయం బయటపడింది. కాగా గత ఏడాది రెండవ ఉత్తమ ఆర్టిస్ట్ గా నిలిచిన టేయిలర్ స్విఫ్ట్ చేసిన ఆల్బమ్ 'ఫియర్ లెస్' 3.2 మిలియన్ అమ్మకాలతో గత ఏడాది అత్యధికంగా అమ్ముడయిన ఆల్బమ్ గా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో సుసాన్ బోయ్లె 'ఐ డ్రీమ్డ్ ఎ డ్రీమ్' 3.1 మిలియన్ అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది. కాగా గత ఏడాది మొత్తంగా 1.5 బిలియన్ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.


Click it and Unblock the Notifications











