సిల్వెస్టర్ స్టాలోన్ మృతి.. ఫోటో పెట్టి దండేసిన..! ఏం జరిగిందంటే..

By Rajababu

ఫస్ట్‌బ్లడ్, రాంబో లాంటి చిత్రాలతో ప్రపంచ సినీ ప్రేక్షకులకు చేరువైన సిల్వెస్టర్ స్టాలోన్ మరణించాడంటూ ఇంటర్నెట్‌లో వార్తలు దూమారం లేపాయి. అయితే తాను మరణించలేదంటూ స్వయంగా ఆయనే ప్రకటన చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. గతంలో కూడా స్టాలోన్ మరణించారంటూ వార్తలు వచ్చాయి. ఇంటర్నెట్ మీడియా విస్తృతి పెరగడంతో సినీ ప్రముఖుల మరణించారంటూ వార్తలు వైరల్ కావడం తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అమితాబ్, కోటా శ్రీనివాసరావు, ఇతర సినీ ప్రముఖుల మరణవార్తలు ఇంటర్నెట్‌లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

స్టాలోన్ మరణం వార్త వైరల్

స్టాలోన్ మరణం వార్త వైరల్

హాలీవుడ్ దిగ్గజ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్‌తో ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతూ తెల్లవారు జామున మరణించాడు. ఆయన వ్యాధిని చాలా సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చినప్పటికీ.. మరణాన్ని అధిగమించలేకపోయాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో స్వైర విహారం చేసింది.

Recommended Video

అతనితో సెక్స్ ఓ కాళరాత్రి..
ఫొటో పెట్టి దండేసి

ఫొటో పెట్టి దండేసి

స్టాలోన్ ఫొటో పెట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని నివాళి అర్పించారు. ఆయన పుట్టిన సంవత్సరం 1946 - మరణ సంవత్సరం 2018 అంటూ ఫొటోపై పేర్కొన్నారు. ఆయనకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.

చెత్తవార్తను పట్టించుకోకండి

చెత్తవార్తను పట్టించుకోకండి

తన మరణవార్తపై హాలీవుడ్ సూపర్‌స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ స్వయంగా ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. ఆ చెత్త వార్తను పట్టించుకోకండి అంటూ ఫ్యాన్స్, సన్నిహితులను కోరారు. నేను జీవించే ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నాను అని స్టాలోన్ తన పోస్టులో పేర్కొన్నారు.

స్టాలోన్ వీడియో షేర్

తాను జీవించే ఉన్నాను అని చెప్పడానికి స్టాలోన్ తన ఇద్దరు కూతుళ్లు సోఫియా, సిస్టిన్‌తో కూడిన వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన చుట్టూ పరిగెడుతున్న కూతుళ్లతో కూడిన వీడియోలో స్టాలోన్ నవ్వుతూ కనిపించారు. మరణం నుంచి మళ్లీ లేచి రావడం చాలా గొప్పగా ఉందంటూ ఆయన స్పందించారు.

 గతంలో కూడా ఇలాగే

గతంలో కూడా ఇలాగే

ఇలాంటి మరణవార్త బారిన పడటం స్టాలోన్‌కు ఇది మొదటిసారి కాదు. 2016 సెప్టెంబర్‌లో కూడా లాస్ ఎంజెల్స్‌లో మరణించారనే వార్త మీడియాలో వైరల్ అయింది. అలాంటి చేదు అనుభవాన్ని ఆయన పలుమార్లు ఎదుర్కొన్నారు.

ది ఎక్సెపెండబుల్4 అనే చిత్రంలో

ఇదిలా ఉండగా, సిల్వెస్టర్ స్టాలోన్ ప్రస్తుతం ది ఎక్సెపెండబుల్4 అనే చిత్రంలో నటిస్తుననారు. ఇటీవల రాకీ స్పిన్నాఫ్ అనే చిత్రానికి సీక్వెల్‌గా క్రీడ్2 రూపొందిస్తున్నట్టు వస్తున్న చిత్రానికి సంబంధించిన అభిమాని తయారు చేసిన పోస్టర్‌ను స్టాలోన్ ఇటీవల షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X