నా కుమారుడి మృతికి కారణాలు కనిపెట్టండి: సిల్వెస్టర్ స్టాలన్

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్, జులై 19: హాలీవుడ్ సూపర్ స్టార్, నటుడు సిల్వెస్టర్ స్టాలన్ తన 36 ఏళ్ల కుమారుడు సేజ్ ఎలా మరణించాడో తెలుసుకోవడానికి ఒక ప్రైవేట్ పరిశోధకుడిని నియమించాడు. తన కుమారుడి మరణం తనకొక మిస్టరీలాగా ఉందని అందుకే ప్రైవేట్ పరిశోధకుడిని నియమించాల్సి వస్తుందని తెలిపాడు. శుక్రవారం నాడు లాస్ ఏంజిల్స్‌లోని స్టూడియో సిటీ అపార్ట్ మెంట్‌లో సేజ్ అపస్మారక స్దితిలో చనిపోయి కనిపించిన విషయం తెలిసిందే.

దీంతో లాస్ ఏంజిల్స్ కోట్నీ కార్నర్స్ ఆఫీసులో ప్రైవేట్ డిటెక్టివ్ స్కాట్ రాస్‌ని స్వయంగా సిల్వెస్టర్ స్టాలన్ కలిసి తన కుమారుడి మృతికి గల కారణాలను అన్వేషించాల్సిందిగా కోరాడని సమాచారం. సేజ్ చివరి వారాలు మొత్తం తనకు తెలియాలన్నాడు. అసలు తన కుమారుడు నిజంగా డ్రగ్స్ ఎక్కువ తీసుకోని చనిపోయాడా లేక ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల లేక మరే ఇతర కారణం ఏదైనా ఉందా అని సిల్వెస్టర్ స్టాలన్ ప్రైవేట్ డిటెక్టివ్ ని కోరడం జరిగింది.

సిల్వెస్టర్ స్టాలన్ తన కుమారుడు సేజ్ చనిపోయిన మరణ వార్త ఆకస్మికంగా వినగానే శోకసముద్రమైనట్లు స్టాలన్ అధికార ప్రతినిధి ద్వారా తెలిసింది. అతని ప్రేమ మరియు ఆలోచనలు సేజ్ యొక్క తల్లి సాషాతో ఉన్నాయని చెప్పాడు. సేజ్ చాలా తెలివైన యువకుర్రాడని అన్నారు. సేజ్‌ని కోల్పోవడంతో సిల్వెస్టర్ స్టాలన్‌ నిశ్చేష్టుడయ్యాడని అన్నారు. శుక్రవారం సేజ్ చనిపోయాడని గుర్తించిన పోలీసు అధికారులు సిల్వెస్టర్ స్టాలన్‌ని మధ్యాన్నం 2.17 నిమిషాల ప్రాంతంలో లాస్ ఏంజిల్స్ ఇంటికి శవమై ఉన్న తన కొడుకు మృతదేహన్ని చూసేందుకు కబురు పంపారు.

ఇది ఒక భయంకరమైన విషాదమని, అతను చాలా చిన్నతనంలోనే చనిపోవడం బాధాకరమని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ కామండర్ ఆండ్రూ స్మిత్ తన సానుభూతిని తెలియజేశారు. పోలీసులకు అందించిన రిపోర్ట్స్ ప్రకారం సేజ్ ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్లనే చనిపోయాడని ఆండ్రూ తెలిపారు. ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ వచ్చిందని పోలీసు నిపుణులు రిపోర్ట్స్ ఆధారంగా చెప్పారు.

తన తండ్రి సిల్వెస్టర్ స్టాలన్‌కు హాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన రాకీ V, సినిమాలో రాకీ కుమారుడు రాబర్ట్ బాల్బోగా సేజ్ నటించాడు. ఈ సినిమా 1990లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X