సల్మాన్‌ఖాన్ ‘రేస్3’కి సిల్వెస్టర్ స్టాలోన్ ప్రచారం..
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అభిమానించే వ్యక్తి సిల్వెస్టర్ స్టాలోన్. ఆయన నటించిన ఫస్ట్‌బ్లడ్, రాంబో చిత్రాలు భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అలాంటి సిల్వెస్టర్ స్టాలోన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన బాబీ డియోల్ పోస్టర్‌ను స్టాలోన్ ఇటీవల షేర్ చేసి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అభినందనలు తెలిపారు. తన తప్పును తెలుసుకొన్న స్టాలోన్ వెంటనే దానిని డిలీట్ చేశారు.
సిల్వెస్టర్ స్టాలోన్ తన తప్పును తెలుసుకొని వెంటనే రేస్3 చిత్రంలోని సల్మాన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. రేస్3 విడుదలవుతున్న సందర్భంగా టాలెంటెడ్ సల్మాన్ ఖాన్‌కు శుభాకాంక్షలు అని స్టాలోన్ అన్నారు.


Click it and Unblock the Notifications











