ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పిన మరో స్టార్ హీరో
లాస్ ఏంజిల్స్: 'రాకీ, ర్యాంబో' సినిమా సిరిస్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ రాక్ స్టార్ సిల్వెస్టర్ స్టాలన్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు గల కారణాలను కూడా సిల్వెస్టర్ స్టాలెన్ ఇటీవల ఓ ఇంట్వర్యూలో వెల్లడించారు.
ట్విట్టర్‌ను వీడటానికి గల కారణాలను ఆయన తెలియజేస్తూ....తనకు తెలియని వారికి తన జీవిత విశేషాలను వెల్లడించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశ్యం, ట్వీట్టర్లో ట్వీట్ చేయడం అంటేనే వ్యర్థమనిపిస్తోంది. దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రచారం కోసం, వివాదాలు సృష్టించడం కోసం ట్విట్టర్ బాగా పని చేస్తుందని చెప్పుకొచ్చాడు.
సిల్వెస్టర్ స్టాలెన్ సినిమా గురించి చెప్పుకుంటే...2010లో హాలీవుడ్‌లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన హాలీవుడ్ చిత్రం 'ఎక్స్‌పెండబుల్స్'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'ది ఎక్స్‌పెండబుల్స్ 2' సినిమా అటు సిల్వస్టర్ స్టాలోన్ అభిమానుల, ఇటు ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ అభిమానుల ఆకట్టుకుని భారీ విజయం సాధించింది.
ప్రస్తుతం సిల్వెస్టర్ స్టాలెన్ నటించిన 'బుల్లెట్ టు ద హెడ్' చిత్రం ఫిబ్రవరి 1న యునైటెడ్ స్టేట్స్ లో విడుదలైంది. ఈ చిత్రం త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరో వైపు సిల్వెస్టర్ స్టాలెన్, ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ కలిసి 'ది టోంబ్' అనే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











