For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమా ప్రపంచంలో మరో విషాదం.. విమాన ప్రమాదంలో 'టార్జాన్' హీరో దుర్మరణం

  |

  సినిమా ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. అసలే కరోనా వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా సాదరణ జనాల నుంచి సినీ ప్రముఖులు వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ కఠిన సమయంలో కొన్ని పెను ప్రమాదాలు చోటు చేసుకోవడం మరింత బాధను కలిగిస్తోంది. మొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా టార్జాన్ గా భారీ క్రేజ్ అందుకున్న 'టార్జాన్ : ది ఎపిక్ అడ్వెంచర్స్' సిరీస్ హీరో విమాన ప్రమాదంలో మరణించడం అందరిని షాక్ కు గురి చేసింది.

  Prabhas పై Mission Impossible 7 Director కామెంట్స్, రూమర్స్ కి చెక్ || Filmibeat Telugu
  టార్జాన్ హీరో..

  టార్జాన్ హీరో..

  టార్జాన్ అనే పదం తెలియని వారు ఉండరు. 90ల కాలం నుంచి ఈ కాలం వరకు చిన్న పిల్లల మనసుకు బాగా దగ్గరైన ఆ పేరుతో చాలామంది హీరోలు టార్జాన్ గా గుర్తింపు అందుకున్నారు. అయితే ఎంతమంది టార్జాన్లు వచ్చినా కూడా జోయ్ లారాను మరిపించలేకపోయారు. వరల్డ్ వైడ్ గా అతను నటించిన సిరీస్ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి యాక్టర్ మృతి చెందడంతో అభిమానులు షాక్ అయ్యారు.

  జెట్ కూలిపోవడంతో

  జెట్ కూలిపోవడంతో

  శనివారం ఉదయం ఎంతో సంతోషంగా ప్రయివేట్ జెట్ లో మొదలైన ఒక ప్రయాణం తీరని విషాదాన్ని మిగిల్చింది. చిన్నపాటి బిజినెస్ జెట్ కూలిపోవడంతో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందారు. అందులో టార్జాన్ హీరో జోయ్ లారా (58) అలాగే అతని భార్య సన్నిహితులు కూడా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.

  సరస్సులో కూలిపోయిన విమానం

  సరస్సులో కూలిపోయిన విమానం

  టెన్నెస్సి ప్రాంతం నుంచి ఫ్లోరిడాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటల సమయంలో విమానం కొన్ని సంకేతిక లోపాలకు గురవ్వడంతో ఒక్కసారిగా సరస్సులో కూలిపోయింది. సౌత్ నాష్ విల్లేలోని పెర్సీ స్ట్రీక్ సరస్సులో విమాన శకలాలు చెల్లాచెదురుగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

  ప్రమాదం జరిగిన కొన్ని గంటల తరువాత

  ప్రమాదం జరిగిన కొన్ని గంటల తరువాత

  ఈ ఘటనలో చనిపోయినవాళ్లలో నటుడు జోయ్ లారా ఉన్నారని జనాలకు కొన్ని గంటల అనంతరం తెలిసింది. అతని భార్య గ్వెన్ ష్వాంబ్లిన్ తో అలాగే అమెరికన్ రచయిత, డైటీషియన్ గ్వెన్ షాంబ్లిన్ తో పాటు మరో నలుగురు సన్నిహిత ప్రయాణికులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుంది. అప్పటికే అందరు ప్రాణాలు కోల్పోయారు.

  2018లో ఆలస్యంగా వివాహం..

  2018లో ఆలస్యంగా వివాహం..

  ప్రస్తుతం చెల్లాచెదురుగా పడినా శకలాలను సేకరిస్తున్న ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రమాదానికి గల అసలు కారణాన్ని కనుగొనే ప్రయత్నాలు చేస్తోంది. లారా పూర్తి పేరు విలియమ్ జోసెఫ్ లారా 1989లో మొదట ‘టార్జాన్ ఇన్ మాన్ హట్టన్' అనే హాలీవుడ్ సినిమా ద్వారా భారీ క్రేజ్ అందుకున్నాడు.

  ఇక 1996లో టెలికాస్ట్ అయిన ‘టార్జాన్ ది ఎపిక్ అడ్వెంచర్స్' టీవీ సిరీస్ ద్వారా గ్లోబల్ వైడ్ గా గుర్తింపు అందుకున్నాడు. ఇక 55 ఏళ్ల వయసులో లారా 2018 గ్వెన్ ష్వాంబ్లిన్ ను వివాహం చేసుకున్నాడు. ఇక ఇంతలోనే వారు ప్రాణాలు కోల్పోవడం అభిమానులను కలచివేస్తోంది.

  English summary
  A voyage that began on a very happy private jet on Saturday morning left an endless tragedy. Seven people were killed on the spot when a small business jet crashed. It was officially announced that Tarzan hero Joey Lara (58) as well as his wife's close friends were among them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X