Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అదంతా ఒట్టిదే.. ఆమెందుకలా చేస్తోందో తెలీదు
హాలీవుడ్ నటుడు టేలర్, హాలీవుడ్ గాయని టేలర్ స్విఫ్ట్ తో ప్రేమాయణం నడుపుతున్నాడనే వార్తలు ఇటీవల హాలీవుడ్ లో చాలా వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఈ వార్తల గురించి వివరణ కోరిన యు.యస్ మ్యాగ్జయిన్ తో మాట్లాడిన టేలర్ అసలు ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ వార్త వినడానికే హాస్యాస్పదంగా వుందని చెప్పాడు. మీరంతా నేను వేస్తున్న ప్రతి అడుగును గమనిస్తున్నారు, నా గురించి మీకు బాగా తెలుసు, కాబట్టి మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని మెలిక పెట్టాడు.
కానీ టేలర్ స్విఫ్ట్ తన గురించి పాట రాయడం గురించి ఇబ్బందిగా అనిపిస్తోందని, ఆమె ఎందుకు తన గురించి పాట రాసిందో తనకు తెలియదని అమాయకంగా అడిగాడు. కానీ టేలర్ స్విఫ్ట్ CMT రేడియోకు ఇచ్చిన ఇంటర్యూలో టేలర్ గురించి అడిగిన ప్రశ్నలకు అతనో అద్భుతమైన వ్యక్తి అని, త్వరలో అతనితో కలసి పనిచెయ్యబోతున్నానని, దాని కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. కానీ టేలర్ మాత్రం ఆవిడ వ్యఖ్యలేవీ పట్టించుకోకుండా 'లవ్ స్టోరీ' సినిమాను తీసిని దర్శకుడితో 'వాలంటెయిన్స్ డే' సినిమాతో బిజీగా వున్నాడు.