మరో సారి గుడ్డలూడదీయడానికి సిద్ధం..!!
హాలీవుడ్ టీనేజ్ హీరో టేలర్ తన గురించి వస్తోన్న వార్తలకు తెగ బాధపడిపోతున్నాడు. ఇటీవలే అతగాడు గాయని టేలర్ స్విఫ్ట్ తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు రావడంతో ఖంగుతిన్న అతడు అదంతా ఒట్టి బూటకం అని మీడియా సమావేశం పెట్టిమరీ ఖండించాడు. కానీ వీరిద్దరి వాలకం చూసినవారంతా వారిద్దరి మధ్య ఎదో కథ నడుస్తోందని గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా టేలర్ గురించి వచ్చిన మరో వార్త అతన్ని కలవరపాటుకు గురిచేసింది. ఆ వార్త కాస్త తన కెరీర్ కు గండి కొట్టేదిలా వుండటంతో మరో సారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఖండిచాడు.,br />
అతన్ని మరీ అంతగా కలవరపెట్టిన వార్త ఏంటంటే తను ఇకపైన సినిమాల్లో షర్టు విప్పడం లాంటివి చెయ్యనని అన్నట్టు ఓ వార్త పుట్టుకొచ్చింది. తనకి బేర్ బాడీతో నటించడం ఇష్టం లేదని, ఇకపై అలాంటి సన్నివేశాలు వుండే సినిమాలను ఒప్పుకోనని అన్నట్టు ఓ వార్త రావడం జరిగింది. ఇది విన్న టేలర్ ఆశ్చర్యపోయాడు, ఈ వార్త ఎక్కడ తన కెరీర్ కు దెబ్బ అవుతుందోనని వెంటనే ఈ వార్తను ఖండించాడు. ఈ వార్త తన ప్రమేయం లేకుండా వచ్చిందని తనకు అలాంటి నిబంధనలు ఏవీ లేవని అవసరం వుంటే మరో సారి గుడ్డలూడదీయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని విలేకర్ల ముందే బట్టలూడదీసినంత పని చేసాడు. సదురు వార్తను ఖండిచడం వరకూ బాగానే వుంది కానీ, ఇలా మీడియా వారిని భయపెట్టడం ఏమన్నా బాగుందా..!!


Click it and Unblock the Notifications











