రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు...!!
హాలీవుడ్ ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్, నటుడు టేలర్ లూట్నర్ ల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని హాలీవుడ్ లో ఎన్నో రోజుల నుండీ వినిపిస్తోంది. కానీ వీరిద్దరూ ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. అంతే కాదు ఆమె లూట్నర్ కోసం ఓ పాటను కూడా రాసింది. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే వార్తలకు బలం చేకూరింది.
ఈ విషయం మీద స్పదించిన వీరు మళ్లీ షరా మామూలే మాయిద్దరి మధ్య ఏమీ లేదని చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల వీరిద్దరూ కలసి రెస్టారెంటుకు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయారు. తాజాగా లూట్నర్ నటిస్తున్న 'వాలెంటైన్స్ డే' సినిమా షూటింగ్ నుండీ వారిద్దరూ కలసి లాస్ ఏంజిల్స్ లోని రెస్టారెంటుకు వెళ్లి కలసి భోజనం చేసి వచ్చారు. ఈ సమయంలో వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగారని వీక్షకులు అభిప్రాయపడ్డారు.
మరి ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పారో తెలుసా, ఏముంది మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మేము కేవలం మిత్రులం మాత్రమేనని చెప్పుకొచ్చారంట. అవునా..? నమ్ముదామా...??


Click it and Unblock the Notifications











