డ్రస్సింగ్ స్టయిల్ లోపవన్ కళ్యాణ్ మాదిరే ఆహీరోయిన్ నుఫాలో అవుతున్న అభిమానులు
సాధారణంగా సినిమా హీరోలు అంటే వాళ్శ అభిమానులకు పిచ్చి ఉండడంలో అర్ధం ఉంది. కాని ఇటీవల కాలంలో వాళ్శు అభిమానించే హీరోలు మరియు హీరోయిన్లు మాత్రమే కాకుండా వారు వేసుకునే డ్రస్సుల మీద కూడా అభిమానం పెంచుకుంటున్నారు. అసలు హీరో వేసుకునే డ్రస్సుల దగ్గర నుంచి ఆయన ఎలా నడుస్తున్నాడు, ఎలా పరిగెత్తుతున్నాడులాంటి అన్ని విషయాలనుకూడా చాలా సునిశితంగా పరిశీలిస్తుంటారు అభిమానులు.
గతంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి బాలు సినిమాకుగాను పవన్ కళ్యాణ్ అక్షరాల లక్ష రూపాయల ప్యాంటు ధరించి ఓవిప్లవం సృష్టించారు. ఆతర్వాత సినిమాలలో ఆయన ధరించినటువంటి చాలా డ్రస్సులు బయట మార్కెట్ విడుదలై పవన్ కళ్యాణ్ ప్యాంటులు అంటూ హాల్ చల్ సృష్టించాయి. అంతేవిధంగా టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు వాళ్శ కంటూ ఓ ప్రత్యేకమైన డ్రస్స్ స్టయిల్ నుఏర్పరచుకున్నారు.
ఇక హాలీవుడ్ విషయానికి వస్తే ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలుకోడుతున్నసినిమా హ్యారీపోటర్ అండ్ ద డెత్లీ హాలోస్. ఇటీవల ఈసినిమాలో నటించినటువంటి హీరోయిన్ ఎమ్మావాట్సన్ కుఅభిమానులు నీరాజనాలు పడుతున్నారు. అంతేకాకుండా దాదాపు 18,000 మంది యువత ముఖ్యంగా 12నుండి 20సంవత్సరాలు లోపుగల అమ్మాయిలు ఎమ్మావాట్సన్ అంటే పడిచచ్చిపోతున్నారంట. ఇటీవల కాలంలో టీనేజర్స్ కుఇష్టమైన హీరోయిన్ ఎవరూ అంటూ నిర్వహించినటువంటి సర్వేలో 87శాతం మంది ఎమ్మావాట్సన్ కుఓట్లువేసి వాళ్శ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈసినిమాలో హీరోయిన్ వేసినటువంటి బ్లేజర్స్ కుమంచి డిమాండ్ ఏర్పడినది. చివరగా ఈవిషయంపై సూపర్ మార్కెట్ యజమానులు మాట్లాడుతూ మాకస్టమర్స్ హ్యారీపోట్టర్ హీరోయిన్ వేసినటువంటి బ్లేజర్స్ స్టయిల్ బాగా నచ్చడంతో మేము త్వరలోనే అలాంటివి మరికోన్ని బ్లేజర్స్ తెప్పించాలని అనుకుంటున్నామని అన్నారు. అంతేకాకుండా టీనేజ్ గర్ల్ హ్యారీ పోట్టర్ హీరోయిన్ స్టయిల్ నురోల్ మోడల్ గాతీసుకుంటున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











