వేశ్యగా మారిన తెలుగు హీరోయిన్.. చాలా గర్వంగా ఉందంటూ షాకింగ్ రియాక్షన్
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ ఒకరు. అందానికి అందంతో పాటు నటన పరంగానూ అలరిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ మూవీలో శోభిత ధూళిపాళ వేశ్య పాత్రలో కనిపించి షాకిచ్చింది. తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఆ సంగతులను మీరే చూడండి!
మిస్ ఇండియా పోటీలతో
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే శోభిత ధూళిపాళ మోడల్‌గా యమా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్ అయింది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తద్వారా శోభిత ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడంలో సఫలం అయింది.

సినిమాల్లోకి.. తెలుగులోకి
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే శోభిత 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి బాలీవుడ్ చిత్రాలను చేసింది. ఈ క్రమంలోనే అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో శోభిత ధూళిపాళ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో తనదైన నటనతో మాయ చేసేసింది.
ఆ భాషల్లో వరుస ఆఫర్లు
'గూఢచారి' హిట్ తర్వాత శోభితకు టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. కానీ, ఆ తర్వాత మలయాళం, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి సత్తా చాటింది. మళ్లీ 'మేజర్'తో తళుక్కున మెరిసినా మన వాళ్లు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీలతో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలోనూ నటించి మెప్పించింది.

ఆ సిరీస్.. మంకీ మ్యాన్
శోభిత ధూళిపాళ హిందీలో 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె అదిరిపోయే గ్లామర్ షో చేసింది. అలాగే, రొమాంటిక్ సీన్స్‌లోనూ అలరించింది. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఇందులోనూ యమా రెచ్చిపోయింది. ఇటీవలే శోభిత 'మంకీ మ్యాన్' అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటించింది. ఇది ఏప్రిల్ 5న యూఎస్‌లో మాత్రమే విడుదల అయింది.
వేశ్య పాత్రలో కనిపించి
'మంకీ మ్యాన్' చిత్రాన్ని మరికొద్ది రోజుల్లోనే ఇండియాలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శోభిత ధూళిపాళ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది. 'మంకీ మ్యాన్ చిత్రానికి యూఎస్‌లో మంచి స్పందన వస్తోంది. ఇందులో నేను సీత అనే వేశ్య పాత్రలో నటించాను. దీనికి కూడా రెస్పాన్స్ లభిస్తోంది' అని చెప్పింది.

చాలా గర్వంగా ఉందని
ఆ తర్వాత శోభిత ధూళిపాళ కంటిన్యూ చేస్తూ.. 'మంకీ మ్యాన్ చిత్రంలో వేశ్యగా వైవిధ్యమైన పాత్రలో నటించినందుకు నాకు గౌరవంగా, గర్వంగా ఉంది. అంతేకాదు, ఈ సినిమాలో నా పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంది. అందుకే నేను పోషించిన ఈ పాత్ర మన దగ్గర ప్రేక్షకుల ఆదరణ అందుకుంటుందని ఆశిస్తున్నాను' అంటూ ఊహించని విధంగా రియాక్షన్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











