టెనెట్‌లో బాలీవుడ్ హీరోయిన్.. సీక్రెట్‌గా క్రేజీ రోల్.. ముంబైలోనే షూట్

దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తదుపరి చిత్రం టెనెట్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు ముస్తాబువుతున్నది. కరోనావైరస్ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికి ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో చిత్ర యూనిట్ అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ అలనాటి హీరోయిన్ డింపుల్ కాపాడియా ఓ కీలక పాత్రను పోషించడం విశేషంగా మారింది.

గతేడాది సెప్టెంబర్‌లో టెనెట్ చిత్రానికి సంబంధించిన ప్రధాన సన్నివేశాలను ముంబైలో చిత్రీకరించారు. రాబర్ట్ పాటిన్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్‌, డింపుల్ కాపాడియాపై ముంబైలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో డింపుల్ కపాడియా రోల్ అత్యంత కీలకంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. అయితే ఆ పాత్ర గురించి వారు బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు.

TENET movie update: Do you know Dimple Kapadia in crucial role

మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా టైమ్ ట్రావెల్, రివర్స్ ఇంజినీరింగ్ అంశాల కలబోతగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ డిసెంబర్ 2019లో రిలీజ్ అయింది.

తాజాగా మే 21వ తేదీన రిలీజైన టెనెట్ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ పాటిన్సన్, ఎలిజబెత్ దెబికి, క్లెమెన్సే పోసీ, ఆరానో టైలర్ జాన్సన్; మైఖేల్ కైనే, కెన్నెత్ బ్రనగ్, అలాగే డింపుల్ కపాడియా కూడా ఓ కీలక పాత్రను పోషించింది.

ముందస్తు ప్లాన్ ప్రకారం.. టెనెట్ చిత్రం జూలై 17న రిలీజ్ కావాల్సింది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల రిలీజ్ డేట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్‌పై వార్నర్ బ్రదర్స్ స్టూడియో కసరత్తు చేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X