టెర్మినేటర్: డార్క్ ఫేట్... అంచనాలు పెంచేసిన ట్రైలర్!

హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే అభిమానులకు 'టెర్మినేట్' సిరీస్ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఇందులో 5 సీరీస్‌లు రాగా త్వరలో 6వ సిరీస్ 'టెర్మినేటర్: డార్క్ ఫేట్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

'డెడ్ పూల్' మూవీ ఫేం టిమ్‌ మిల్లర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేయగా సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో పాటు అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.

Terminator: Dark Fate Official Teaser Trailer superb

ప్రఖ్యాత హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గెర్ ఇందులో ఏజ్ అయిపోయిన టెర్మినేటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. విలన్ టెర్మినేటర్ రెవ్‌-9 (గేబ్రియల్‌ లూనా) నుంచి డ్యానీ (నటాలియా రెయేస్‌) కాపాడేందు సారా కోన్నర్‌ (లిండా హ్యామిల్టన్‌)ను రిక్రూట్ చేసుకుంటాడు. డ్యానీని రెవ్‌-9 అనే టెర్మినేటర్ ఎందుకు చంపాలనుకుంటుంది? దాని బారి ఆమెను ఎలా కాపాడారు అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

దాదాపు 200 మిలియన్ డాలర్ ఖర్చుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పారామౌంట్‌ పిక్చర్స్‌, 20వ సెంచరీ ఫాక్స్, స్కైడాన్స్ మీడియా, టెన్సెంట్ పిక్చర్స్ పతాకాలపై జేమ్స్ కెమరూన్‌, డేవిడ్‌ ఎల్లిసన్‌ నిర్మిస్తున్నారు.

ఈ సిరీస్‌లో చివరగా వచ్చిన 'టెర్మినేటర్: జెనిసీస్' 2015లో విడుదలైంది. 150 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 440 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 'టెర్మినేటర్: డార్క్ ఫేట్' మూవీ కనీసం 1 బిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X